కేసీఆర్ బిచ్చం అవసరం లేదు : నేనే రూ. 500 కోట్లు ఇస్తా – బాబు

10TV Telugu News

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బిచ్చం అవసరం లేదు..కావాలంటే రూ. 500 కోట్లు తానే ఇస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతి రాజధానిని చూసి కేసీఆర్ కుళ్లు పెట్టుకున్నాడని..ఏపీ ఆస్తిని కొట్టేశాడని బాబు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్..జగన్‌లపై బాబు విమర్శలు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ‘జాబు రావాలంటే బాబు రావాలని’ అనే నినాదంతో ముందుకొచ్చినట్లు..ఇప్పుడు ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అనే నినాదంతో ముందుకొస్తున్నట్లు తెలిపారు. మార్చి 28వ తేదీ గురువారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బాబు పాల్గొని ప్రసంగించారు. 

హైదరాబాద్ కంటే అమరావతి గొప్పగా ఉండాలనే సంకల్పంతో ముందుకెళ్లానని, రూ. 500 కోట్లు ఇవ్వాలని అనుకున్నట్లు ఆనాడు కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. నీ బిచ్చం అవసరం లేదు..అవసరమైతే రూ. 500 కోట్లు ఇస్తానన్నారు బాబు. అమరావతికి రైతులు ఎంతో సహాయం చేశారని, 35వేల ఎకరాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ కంటే మెరుగైన రాజధాని అవుతుందని కేసీఆర్ భావించి కుళ్లు పెట్టుకున్నాడని, అందుకే జగన్‌కు సపోర్టు చేస్తున్నాడన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కేసీఆర్..వైసీపీకి వేల కోట్లు పంపించాడని ఆరోపించారు.  జగన్‌పై 31 కేసులున్నాయి..ఆయనకు నేరచరిత్ర తప్పించి ఏమీ లేదని..పట్టి సీమ, హంద్రీనీవా, గాలేరు, పోలవరం ప్రాజెక్టులకు జగన్ అడ్డం పడ్డాడని ఇంత చేసినా తాను భయపడకుండా బుల్లెట్‌లా దూసుకెళ్తాన్నారు. 

ఏప్రిల్ మొదటి వారంలో నాలుగు, ఐదో విడత రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. దేశంలో ఎక్కడా జరగని వ్యవసాయం ఏపీలో జరుగుతోందని..బుక్కపట్నం చెరువుకు నీటిని తరలించామన్నారు. అనంతపురం రూపురేఖలు మార్చినట్లు..కరవు జిల్లా ఆనంద జిల్లాగా మారుస్తున్నట్లు చెప్పారు. ఈ జిల్లాలో వలసలు లేకుండా చేసిన ఘనత తమకే దక్కుతుందని..పెళ్లి కానుక ద్వారా రూ. లక్ష..చంద్రన్న బీమా ద్వారా రూ. 5 లక్షలు..ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు బాబు. 

×