ఏపీ అంటేనే మోడీకి అక్కసు : బాబు కౌంటర్

  • Edited By: madhu , January 7, 2019 / 06:26 AM IST
ఏపీ అంటేనే మోడీకి అక్కసు : బాబు కౌంటర్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్..కేంద్రం మధ్య వైరం తారాస్థాయికి చేరుకొంటోంది. సై..సై..అంటున్నాయి. కేంద్రం…మోడీపైనే బాబు విమర్శలకు దిగుతుండడంతో…మోడీ కూడా రంగంలోకి దిగేశారు. బాబుపై ఘాటు కౌంటర్‌లిస్తున్నారు. ఏపీని వదిలేసి.. కేవలం కొడుకు రాజకీయ ఎదుగుదల పైనే చంద్రబాబు దృష్టి సారించారని పేర్కొన్న మోడీ…ఏపీలో భారీగా జరుగుతున్న అవినీతి, అక్రమాలు, పాలసీలను చంద్రబాబు పట్టించుకోలేదని కౌంటరిచ్చారు. దీనిపై బాబు కూడా స్పందించారు. 
ఏపీ శకటంపై అక్కసు…
ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీపై మరోసారి ఫైర్ అయ్యారు. జనవరి 07వ తేదీ సోమవారం ఆయన మాట్లాడారు…ఏపీకి అవార్డులు వస్తునందుకే మోడీ అసూయ పెంచుకున్నారని…ఏపీ పేరు వినబడితేనే మోడీలో అక్కసు పెరిగిపోతోందన్న ఆయన.. ప్రభుత్వాన్ని ఏమీ అనలేక వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ నిందల్లో నైరాశ్యం కనిపిస్తోందన్న చంద్రబాబు.. ప్రధాని హుందాను వదిలేసి తన కుటుంబంపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి ఏపీ శకటంపై కూడా కేంద్రం తన అక్కసు వెళ్లగక్కిందన్నారు. రిపబ్లిక్ డేకు ఏపీ శకటం లేకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రంలో బీజేపీ కక్షసాధింపునకు ఇది పరాకాష్ట అన్నారు చంద్రబాబు.