అడుగడుగునా అవమానం: చంద్రబాబు ఆవేదన

  • Published By: vamsi ,Published On : December 13, 2019 / 09:52 AM IST
అడుగడుగునా అవమానం: చంద్రబాబు ఆవేదన

అసెంబ్లీలో తనను అడుగడుగునా అవమానిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘బుద్ధి, జ్ఞానం ఉందా? అని నిన్న నన్ను ముఖ్యమంత్రి అన్నారని అన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరి తీయాలని, చెప్పుతో కొట్టాలని ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత అన్నారని గుర్తు చేశారు. ఓ మంత్రి అయితే ఇంకా ఘోరంగా మాట్లాడారని, మాకు నేరాలు చేయడం చేతకాదని అన్నారు.

మీకు అవన్నీ అలవాటని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఓ పద్ధతి ప్రకారం పని చేయడం కోసం నేను నా జీవితాంతం పని చేస్తానని అన్నారు. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించేలా పరిపాలన ఉండాలని, కానీ, ఉన్మాది పాలనగా ఉండకూడదని చంద్రబాబు హితవు పలికారు. ‘14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అసెంబ్లీ లోపలికి రానీవ్వకుండా అడ్డుకున్నారనే బాధతో మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశంతో కాదని అన్నారు.

మార్షల్స్‌తో మమ్మల్ని అవమానించి  తిరిగి మమ్మల్నే అంటున్నారని మండిపడ్డరు చంద్రబాబు. నా హక్కు కోసం గట్టిగా ప్రశ్నించా.. నో క్వశ్చన్ అనే పదాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అన్నారు చంద్రబాబు. పరుషంగా మాట్లాడటం నాకు రాదని చంద్రబాబు అన్నారు.