బాంబులు వేస్తేనే భయపడలేదు..జగన్‌కు భయపడుతానా – బాబు

  • Published By: madhu ,Published On : September 30, 2019 / 11:51 AM IST
బాంబులు వేస్తేనే భయపడలేదు..జగన్‌కు భయపడుతానా – బాబు

తనపై బాంబులు వేస్తేనే భయపడలేదు..సీఎం జగన్‌కు భయపడుతానా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. భయం అంటే తెలియని వ్యక్తి కోడెల అని, కోడెలది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు చంద్రబాబు. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో ఎస్ఎస్ఎస్ కళాశాలలో కోడెల సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న బాబు మాట్లాడారు. తప్పుడు కేసులు పెడితే మాత్రం కోర్టుకు ఈడుస్తామంటూ పోలీసులను హెచ్చరించారు. రాష్ట్రంలో కరెంటు కోతలు అప్పుడే స్టార్ట్ అయ్యాయన్నారు. ఏపీ రాష్ట్రం కోసం సీఎం జగన్ ఏమి చేయడం లేదన్నారు. 

ఇదిలా ఉంటే.. బాబు ట్విట్టర్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. ‘కోడెలగారిని తప్పుడు ఆరోపణలతో, కేసులతో వేధించి ఆయన మృతికి కారణమైన వైసీపీ వాళ్ళు మనిషి చనిపోయిన తర్వాత కూడా పగ తీర్చుకుంటున్నారంటే ఏమనుకోవాలి? విగ్రహ ఏర్పాటు దిమ్మెను కూల్చడం ఏంటి? మూడు దశాబ్దాలు ప్రజాసేవలో కొనసాగిన కోడెల విగ్రహాన్ని పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసుకుంటే తప్పా’? అంటూ ట్వీట్ చేశారు. 

Read More : లంగరుకు బోటు చిక్కిందా?

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల మృతిపై టీడీపీ పలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ హత్యేనంటూ విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ 16వ తేదీ తన ఇంట్లో అనుమానాస్పదంగా కోడెల శివప్రసాదరావు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఫ్యామిలి మెంబర్స్ వెల్లడించారు. కానీ ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇన్వేస్టిగేషన్‌లో పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.