బాలల దినోత్సవం రోజున బాబు దీక్ష ఏంటీ : బొత్స 

  • Edited By: veegamteam , November 5, 2019 / 08:51 AM IST
బాలల దినోత్సవం రోజున బాబు దీక్ష ఏంటీ : బొత్స 

మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీలో ఇసుక కొరత సమస్యలపై నవంబర్ 14న దీక్ష చేయనున్నారనే ప్రకటనపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేవారు. నవంబర్ 14న బాలల దినోత్సవం ఆరోజున చంద్రబాబు దీక్షకు కూర్చోవటం ఏమిటంటూ ప్రశ్నించారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇసుక దోపిడీలకు పాల్పడటం వల్లనే నేడు రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు దీక్షలు చేసినా..ఏం చేసినా ప్రజలు నమ్మరని ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు పోగొట్టుకున్నారని అన్నారు.

టీడీపీని వీడిన సుజనా చౌదరి బీజేపీలో ఉన్నా చంద్రబాబుకి తోకలాగానే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా..భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్  జన్మదినం రోజు నవంబర్ 14. ఈరోజునే భారతదేశంలో బాలల దినోత్సంగా జరుపుకుంటామనే విషయం తెలిసిందే. సరిగ్గా ఈరోజునే చంద్రబాబు దీక్ష చేస్తారనే ప్రకటనపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.