చంద్రబాబు సంచలన హామీ : ఇంటర్ నుంచే నిరుద్యోగ భృతి

చిత్తూరు : ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు సంచలన హామీ ప్రకటించారు. నిరుద్యోగ భృతిపై కీలక ప్రకటన చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ లో ఇంటర్ పూర్తయిన తర్వాత

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 03:53 PM IST
చంద్రబాబు సంచలన హామీ : ఇంటర్ నుంచే నిరుద్యోగ భృతి

చిత్తూరు : ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు సంచలన హామీ ప్రకటించారు. నిరుద్యోగ భృతిపై కీలక ప్రకటన చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ లో ఇంటర్ పూర్తయిన తర్వాత

చిత్తూరు : ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు సంచలన హామీ ప్రకటించారు. నిరుద్యోగ భృతిపై కీలక ప్రకటన చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ లో ఇంటర్ పూర్తయిన తర్వాత నుంచే నిరుద్యోగ భృతి అందజేస్తామని చెప్పారు. చంద్రగిరిలో టీడీసీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. నిరుద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేస్తామన్నారు. ఇంటర్ నుంచే నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు భృతిగా ఇస్తోంది. రెండు నెలల క్రితమే దాన్ని రూ.2వేలకు పెంచారు. దరఖాస్తుదారులు నిరుద్యోగులై ఉండాలి. కనీస విద్యా అర్హతలు గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా(రెండేళ్లు). 22 నుంచి 35 ఏళ్ల వయసు వారు మాత్రమే అర్హులు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం చేసే వారు అనర్హులు.

తాను ఏం పని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తానని చంద్రబాబు చెప్పారు. గర్భిణుల వైద్యం, మందుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, రైతులకు శాశ్వతంగా పెద్దన్నగా ఉంటానని, వ్యవసాయానికి భవిష్యత్తులో 12 గంటలపాటు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో ఎక్కడ చూసినా చంద్రన్నే కులం, టీడీపీనే మతం అనేలా ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా కేసీఆర్ డబ్బులు పంపారని, వాటిని పంచాలని చూస్తున్నారని, ఆ పాపిష్టి డబ్బును తీసుకోవద్దని ప్రజలకు చంద్రబాబు సూచించారు.