అయ్యారే..!! : ఈ పూజారి మార్షల్ ఆర్ట్స్ చూస్తే మతిపోతుంది

  • Edited By: nagamani , August 30, 2020 / 05:12 PM IST
అయ్యారే..!! : ఈ పూజారి మార్షల్ ఆర్ట్స్ చూస్తే మతిపోతుంది

గుడిలో పూజారి అంటే ‘శుక్లాం బరధరం విష్ణు శశి వర్ణం’ అంటూ మంత్రాలు జపిస్తారు. పంచె కట్టుకుని..నుదుటిన విభూతి పెట్టుకుని..మెడలో యజ్ఞోపవీతంతో చేతిలో గంట..మరోచేతిలో శఠగోపం పట్టుకుని దేవాలయానికి వచ్చే భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తుంటార. కానీ కరాటే..కుంఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ తో ‘హా..హూ..అంటూ కిక్కులిస్తే ఎలా ఉంటుంది.

కర్రను విష్ణు చక్రంలా తిప్పేస్తూ గరిడీ సాములు చేస్తుంటూ..అసలు ఈయన అయ్యవారా లేకా మార్షల్ ఆర్ట్స్ లో స్పెషలిస్టా అనే డౌట్ వస్తుంది కదూ.. అదిగో సరిగ్గా అటువంటి అయ్యవారిని చూసిన జనం కూడా అదే అనుకుంటున్నారు..అ అయ్యవారి పేరు అదేనండీ పూజారి పేరు శేషాద్రి. చెన్నై బీసెంట్ నగర్ లో ఉన్న అష్టలక్ష్మి ఆలయం పూజారిగా పనిచేస్తున్నారు.

శేషాద్రి వృద్ధాప్యంలో ఉన్న కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట. అలాగని వేదాలు గురించితెలీదనుకోవద్దు..శేషాద్రి వేదవేదాంగ పారంగతుడు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ లో స్పెషలిస్ట్. కండలు తిరిగిన యోధుడిని కూడా చిటికెలె మట్టి కరిపించేస్తారు శేషాద్రి ఈ వయస్సులో కూడా. అంతేకాదు..శేషాద్రి గురించి తెలుసుకోవాలే గానీ ఎంతో ఉంది ఆయనలో సత్తా..భారతీయ పురాతన యుద్ధ విద్య సిలంబం (కర్రసాము) లోనూ నిష్ణాతుడు కూడా.

కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించిన ఈ పూజారి జాతీయస్థాయి పోటీల్లో చాంపియన్ షిప్ సాధించడం మరో విశేషం. ఆయనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. అందులో శేషాద్రి ప్రదర్శిస్తున్న యుద్ధ విద్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

గతంలో టీటీడీ శేషాద్రిని తిరుమల శ్రీవారికి సేవలు అందించే పూజారులకు కూడా యుద్ధ విద్యల్లో తర్ఫీదునివ్వాల్సిందిగా కోరింది. అయితే తాను బీసెంట్ నగర్ అష్టలక్ష్మి ఆలయంలో శాశ్వత ప్రాతిపదికన సేవలు అందిస్తున్నానని, తిరుమల రాలేనని స్పష్టం చేయటంతో అది జరగలేదు.