పోలీసులతో పోరాడాలా..? టీడీపీ వాళ్లతోనా..?

  • Published By: vamsi ,Published On : March 1, 2019 / 02:33 PM IST
పోలీసులతో పోరాడాలా..? టీడీపీ వాళ్లతోనా..?

ఓటర్ల జాబితాలో తెలుగుదేశం అక్రమాలకు పాల్పడుతుందంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఓటర్ల జాబితాలోని అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి అనుకూలంగా లేని వారి ఓట్లన్నీ తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాబ్‌లతో సర్వే చేసి మరీ ఓట్లను టీడీపీ వాళ్లు తొలగిస్తున్నారంటూ ఆయన వెల్లడించారు. బీఎల్ఓలంతా టీడీపీవాళ్లేనని, ఓట్లను తొలగించమని వాళ్లే అధికారులకు సూచిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రభుత్వ టెలికాన్ఫరెన్స్‌ లలో వైసీపీ ఓట్లను తొలగించమని.. 325 మంది బూత్ లెవల్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చారని ఆయన అన్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీతో పోరాడాలా? లేకుంటే పోలీసులతో పోరాడాలా? అంటూ ఆయన ప్రభుత్వాన్న ప్రశ్నించారు. కొందరు పోలీసులు పరోక్షంగా తెలుగుదేశంకు సహకరిస్తున్నారని, చిత్తూరు ఎస్పీ ఇంటికి పిలిపించి వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం అక్రమంగా వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తుందంటూ ఆరోపించారు.