మాతో పెట్టుకోకండి..మనశ్శాంతి లేకుండా చేస్తాం..నార్వేకు చైనా స్వీట్ వార్నింగ్

  • Published By: nagamani ,Published On : August 31, 2020 / 09:01 AM IST
మాతో పెట్టుకోకండి..మనశ్శాంతి లేకుండా చేస్తాం..నార్వేకు చైనా స్వీట్ వార్నింగ్

‘నోబెల్ బహుమతి’ఎంత ప్రతిష్టాత్మకమైనదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నోబెల్ బహుహతి పొందిన ఎక్కువగా సాధించిన దేశాలు గర్వంగా ఫీలవుతుంటాయి. కానీ చైనా మాత్రం ‘మా వాళ్లకు నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చి.. మాలో మాకు గొడవలు పెట్టారో మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం’..చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి నోబెల్ శాంతి బహుమతిని ఉపయోగించుకుంటే మీకు మేమేంటో చూపిస్తాం…గౌరవనీయమైన అవార్డును రాజకీయం చేయడాన్ని చూస్తే బాగుందంటూ చైనా నార్వేకు వార్నింగ్ ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది.



ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి వాంగ్ యి నార్వే విదేశాంగ మంత్రితో వాంగ్ చర్చలు జరిపి బయటకు వచ్చిన తర్వాత.. భవిష్యత్తులో నోబెల్ శాంతి బహుమతిని హాంగ్‌కాంగ్ ఆందోళనకారులకు ఇస్తే మీ స్పందన ఏంటని మీడియా ప్రశ్నించగా..గతంలో కావచ్చు.. వర్తమానం లేదా భవిష్యత్తులో కావచ్చు.. నోబెల్ శాంతి పురస్కారం పేరిట మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వాంగ్ ఘాటుగా బదులిచ్చారు.
https://10tv.in/we-are-not-anyones-puppets-farooq-abdullahs-retort-to-pak/
‘మా వాళ్లకు గనక అంటే తమకు హాంకాంగ్ కు అనే అర్థం వచ్చేలా మంత్రి వ్యాఖ్యానించారు. హాంకాంగ్‌ ఒక ప్రత్యేక దేశంలా అనిపించినా.. అది చైనా పాలనా అధికారాల కింద ఉన్న ప్రత్యేక ప్రాంతం మాత్రమే. ఈమధ్య చైనా ఒక కొత్త భద్రతా చట్టాన్ని తీసుకువచ్చింది. దానిని హాంకాంగ్‌ ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి.. నిరసన ప్రదర్శనలు చేపట్టారు.



ఈ క్రమంలో హాంకాంగ్ నిరసనకారులకు నార్వే నోబెల్‌ కమిటీ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించే అవకాశం ఉందని చైనా పసిగట్టినట్టుంది. దీంతో ముందు జాగ్రత్తగా నోబెల్ బహుమతి పేరిట మా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చవద్దని..దానికి నోబెల్ బహుమతిని ఉపయోగించుకోవద్దంటూ వార్నింగ్ గట్టిగా హెచ్చరించింది. మెత్తగా మొత్తుతూ..సుతి మెత్తగా మాట్లాడటం చైనా స్పెషాలిటీ అని మంత్రి మరోసారి నిరూపిస్తు..నోబెల్ గురించి వార్నింగ్ ఇచ్చిన మంత్రి..ఇరు దేశాలు పరస్పర గౌరవంతో.. ఒకరినొకరు సమానంగా పరిగణిస్తూ ముందుకెళ్లినంత కాలం ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా ముందుకెళ్తాయని వాంగ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

కాగా..చైనా అసమ్మతి నేత లియూకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వడంతో డ్రాగన్ చైనాతో సంబంధాలను నిలిపేసింది. దలైలామాకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించినప్పుడు కూడా ఇలాగే వ్యవహరించిన విషయం తెలిసిందే. చైనా విదేశాంగ మంత్రి నార్వేలో పర్యటించడం 15 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం మరింతగా గమనించాల్సిన విషయం. కాగా..భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్యశాస్త్రం,శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన వారికి ‘నోబెల్’ బహుమతులు ఇస్తుంటారనే విషయం తెలిసిందే.