రాత్రి టీడీపీ నేత ఇంట్లో మద్యం బాటిల్స్ పెట్టిన దుండగులు..ఉదయం ఎక్సైజ్ దాడులు : ఎన్నికల్లో సినిమాటిక్ సీన్స్

  • Published By: veegamteam ,Published On : March 13, 2020 / 06:24 AM IST
రాత్రి టీడీపీ నేత ఇంట్లో మద్యం బాటిల్స్ పెట్టిన దుండగులు..ఉదయం ఎక్సైజ్ దాడులు : ఎన్నికల్లో సినిమాటిక్ సీన్స్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం నేతలు ఎంతకైనా దిగజారుతున్నారు. ప్రత్యర్ధులను ఇరికించటానికి చేయకూడని పనులు చేస్తున్నారు. ఏపీలో జెడ్పీసీటీ…ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న ఈ క్రమంలో సినిమా సీన్లు తలపించేలా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి.

గుంటూరు జిల్లా తెనాలిలోని 4వ వార్డు ప్రాంతంలో టీడీపీకి చెందిన అభ్యర్థి ఇంటికి రాత్రి (మార్చి 12,2020) సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. అలా వచ్చిన వారిలో ఓ వ్యక్తి ఏమాత్రం చప్పుడు చేయకుండా ఇంటిపైకి వెళ్లాడు. అలా వెళ్లిన దుండగుడు డాబాపైన ఉన్న వాటర్ ట్యాంక్ పక్కనే కొన్ని మద్యం బాటిల్స్ పెట్టి పోయారు. 
 

రాత్రి దుండగుడు మద్యం బాటిల్స్ పెట్టి పోయిన తరువాత ఉదయం ఏదో పక్కా ప్లాన్ చేసినట్లుగా సదరు టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వచ్చారు. అలా వచ్చీ రాగానే ఎక్సైజ్ అధికారులు మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంది? దాన్ని మేం తనీఖీలు చేయాలని అడిగారు. ఎందుకు అలా అడుతున్నారని ఇంటి యజమానులు ప్రశ్నించగా..మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ లో మద్యం దాచి పెట్టినట్లుగా మాకు సమాచారం వచ్చిందని ఎన్నికల్లో పంచటానికే మీరు మద్యం దాచారని సమాచారం వచ్చిందని తెలిపని వారు వెంటనే వాటర్ ట్యాంక్ దగ్గర తనిఖీలు చేయగా కొన్ని మద్యం బాటిల్స్ కనిపించాయి. వాటిని స్వాధీన చేసుకుని టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన తీసుకెళ్లారు. 

దీంతో స్థానికి టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారంగా ఇది జరిగిందనీ..లేకుండా ఇదంతా  మాపై కుట్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాపై కుట్ర జరుగుతుందోదంటూ టీడీపీ నేతలు సాక్ష్యాలతో సహా బైటపెట్టారు.  

అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లటం..నేరుగా వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లి మద్యం బాటిల్స్ ఉంచటం..ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ పుటేజ్ ను ఆధారంగా చూపించి మాపై కుట్ర జరుగుతోంది. తప్పు చేసినవారిని వదిలేసి మాపై ఇలా వేధించటం సరికాదంటున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల్లో టీడీపీ నేతలు ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించేందుకు ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. 

See Also | టీడీపీ నాయకులపై దాడి చేసిన వ్యక్తికి బెయిల్