దేవినేని ఉమా, సోమిరెడ్డిలను అభినందించిన కొడాలి నాని. ఎందుకంటే!

  • Published By: chvmurthy ,Published On : March 31, 2020 / 09:59 AM IST
దేవినేని ఉమా, సోమిరెడ్డిలను అభినందించిన కొడాలి నాని. ఎందుకంటే!

రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని  ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. అందరికీ రేషన్ అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రేషన్ డిపోల వద్ద జనం గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్‌ డిపోల వద్ద సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. కరోనా నియంత్రణపై వలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారని అభినందించారు. 

వలంటీర్లు ప్రతి ఇంటికివెళ్లి వాళ్ల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో వాలంటీర్లుగా వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టుకున్నారు…..రౌడీలు, దొంగలు ఉన్నారని నిందలు వేసి మాట్లాడిన సోమిరెడ్డి, దేవినేని ఉమలే  ఈరోజు వాలంటీర్ల అవసరాన్ని గుర్తించడం అభినందనీయమని కొడాలి నాని అన్నారు. 

చంద్రబాబుకు పనిపాట లేదు…చంద్రబాబు అద్దాల గదిలో కూర్చున్నాడు.  కరోనా వైరస్ వస్తే 70 ఏళ్ల వయస్సులో పోతానని చెప్పి రాష్ర్టాన్ని గాలికి వదిలివేసి పోయి హైద్రాబాద్ లో కూర్చున్నాడు.  రాష్ర్ట ప్రజలు ఏమైపోయారో కూడా పట్టించుకోని పరిస్దితి….పెళ్లాం,పిల్లలు,మనవడ్ని అందర్ని తీసుకుని వెళ్లి హైద్రాబాద్ వెళ్లి అద్దాల రూమ్ లో ఆక్సిజన్ పెట్టుకుని బతుకుతున్నాడని నాని విమర్శించారు. 

ఈరోజు కరోనా వైరస్ వల్ల మనిషి పనిచేసుకోలేని పరిస్దితి వచ్చింది…అన్ని రకాలుగా సర్వనాశనం అయ్యే స్దితిలో ప్రపంచం ఉంటే ….కొడాలి నాని,శ్రీ వైయస్ జగన్ వల్ల వృద్దురాలు చనిపోయిందంటూ కోడిగుడ్డుపై ఈకలు పీకే సంస్కృతికి స్వస్తి చెప్పి సమాజంలో మనుషులు గా మెసలాలి.

ఇలాంటి విపత్కర పరిస్దితులలో రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ నాయకులకు కొడాలి నాని హితవు చెప్పారు. చంద్రబాబు లాగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి దాక్కోలేదు. కరోనా నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఉందని..ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన చర్యలు తీసుకున్నారని మంత్రి వివరించారు. 

Also Read | కరోనాతో చనిపోయిన వారు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా.. అంత్యక్రియలు ఇలానే చేస్తారు