ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు

అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఓటు వేశారు. కుటుంబసమేతంగా చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 02:40 AM IST
ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు

అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఓటు వేశారు. కుటుంబసమేతంగా చంద్రబాబు

అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఓటు వేశారు. కుటుంబసమేతంగా చంద్రబాబు పోలింగ్ బూత్ కు వచ్చారు. చంద్రబాబు వెంట కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఉన్నారు. లోకేష్, బ్రాహ్మణి కూడా ఓటు వేశారు. గురువారం(ఏప్రిల్ 11, 219) ఉదయం 8గంటలకు చంద్రబాబు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు.

ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓటర్లంతా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఈసీ అనుమతిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో 2వేల 118 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్‌సభ బరిలో 319 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఏపీలో 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కోటి 94 లక్షల 62వేల 339 మంది పురుష ఓటర్లుకాగా… కోటి 98 లక్షల 79వేల 421 మంది మహిళా ఓటర్లు. టాన్స్‌ జెండర్లు మరో 3వేల 957 మంది ఉన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 42 లక్షల 4వేల 436 మంది ఓటర్లు ఉండగా… అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18 లక్షల 18వేల 113 మంది ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 46వేల 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.