వీవీప్యాట్ వ్యవహారం : న్యాయం జరిగే వరకు పోరాటం

ఢిల్లీ : వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయం కోసం పోరాటం

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 06:40 AM IST
వీవీప్యాట్ వ్యవహారం : న్యాయం జరిగే వరకు పోరాటం

ఢిల్లీ : వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయం కోసం పోరాటం

ఢిల్లీ : వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో మళ్లీ ఈసీ దగ్గరికి వెళతామని చంద్రబాబు చెప్పారు. తమ డిమాండ్ ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అన్నారు. ఎన్నికలను ఈసీ పారదర్శకంగా నిర్వహించాలని చంద్రబాబు కోరారు. ఈసీకి జవాబుదారితనం ఉండాలన్నారు. ఎన్నికల ఫలితాల సమయంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు తప్పనిసరిగా లెక్కించాలని కోరుతూ తాము వేసిన రివ్యూ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందని చంద్రబాబు చెప్పారు. ఈవీఎం, వీవీప్యాట్ లో వ్యత్యాసాలు ఉంటే ఆ నియోజకవర్గం ఓట్లు మొత్తం లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలోని అన్ని పద్ధతుల్లో దీనిపై పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు తెలిపారు. కొంత సమయం పట్టినా విశ్వసనీయత, ట్రాన్సపరెన్సీ ముఖ్యం అని అన్నారు. వీవీ ప్యాట్ల వ్యవహారంలో తమకు సహకరించిన వారికి చంద్రబాబు థ్యాంక్స్ చెప్పారు. 21 పార్టీల నేతలు ఒక్కటిగా ఉన్నామన్నారు. న్యాయం సాధించే వరకు కలిసే ఉంటామన్నారు. సుప్రీంకోర్టు అపెక్స్ బాడీ అని, దాని నిర్ణయాన్ని అంతా గౌరవించాలని చంద్రబాబు అన్నారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమ పోరాటం ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. వీవీ ప్యాట్ కోసం 2009 నుంచి తాను ఫైట్ చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. తన పోరాటంతోనే వీవీ ప్యాట్ లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వాటిపైనా సందేహాలు వస్తున్నాయని, నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని చంద్రబాబు అన్నారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో 50శాతం వీవీప్యాట్ స్లిప్పుల‌ను తప్పనిసరిగా లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నేృతృత్వంలో 21 విపక్ష పార్టీల నేతలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం (మే 7,2019) తిర‌స్క‌రించింది. ఈ అంశంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ఉద్దేశం తమకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో కేవ‌లం 5 వీవీప్యాట్ స్లిప్పుల‌ను మాత్ర‌మే ఈవీఎంల‌లో పోలైన ఓట్లతో లెక్కించాలని ఏప్రిల్ 8వ తేదీన సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సంతృప్తి చెందని ప్రతిపక్షాలు ఈ సంఖ్యను 50శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ మరోసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించడం జరిగాయి. రివ్యూ పిటిషన్ పై కేవలం నిమిషంలో వాదనలు ముగించి కోర్టు తన తీర్పు ఇచ్చింది.