నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ : ఇంటర్వ్యూలు రద్దు.. మెరిట్ ఆధారంగా ఉద్యోగం

  • Published By: madhu ,Published On : October 17, 2019 / 09:39 AM IST
నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ : ఇంటర్వ్యూలు రద్దు.. మెరిట్ ఆధారంగా ఉద్యోగం

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 17వ తేదీ గురువారం ఏపీపీఎస్సీ పరీక్షలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. 
ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారిని కేవలం రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక చేయనున్నారు.

ఇప్పటి వరకున్న ఇంటర్వ్యూ పద్ధతిని తొలగించేసింది. అర్హత రాత పరీక్షలో ఉత్తీర్ణత, మెరిట్ వచ్చే వారికి మాత్రమే ఉద్యోగాలు రానున్నాయి. ప్రతి ఏటా జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం కానుంది. గ్రామ సచివాలయాల భర్తీ ఇదే విధంగా జరిగిన సంగతి తెలిసిందే.

కేవలం మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఎలాంటి అవినీతి లేకుండా..పైరవీలు లేకుండా..ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనిపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
Read More : ఏం జరుగుతోంది : కూచిపూడికి కూచిబొట్ల..దాతలతో సమావేశం