దేవుడికే తెలియాలి అంటూ కేసీఆర్ అన్న కాసేపటికే : ఆర్టీసీ విలీనంపై సీఎం జగన్ కీలక జీవో

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో సీఎం జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్

  • Edited By: veegamteam , October 24, 2019 / 03:34 PM IST
దేవుడికే తెలియాలి అంటూ కేసీఆర్ అన్న కాసేపటికే : ఆర్టీసీ విలీనంపై సీఎం జగన్ కీలక జీవో

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో సీఎం జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో సీఎం జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్‌ను నియమించారు. ఆర్ధిక, సాధారణ పరిపాలన, రవాణ, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో… ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ను నియమిస్తూ జీవో జారీ చేశారు. ప్రజారవాణా శాఖ ఏర్పాటు.. పోస్టులు.. డెసిగ్ నేషన్ల ఏర్పాటుపై దృష్టి సారించనుంది వర్కింగ్ గ్రూప్. జీతాల చెల్లింపులు.. పే-స్కేల్ వంటి అంశాల్లో విధి విధానాలను ఖరారు చేయనుంది. నవంబర్ 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని వర్కింగ్ గ్రూప్ కి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. 
అయితే ఏపీలో ఆర్టీసీ విలీనంపై జగన్ ప్రభుత్వం కేవలం కమిటీ మాత్రమే వేసిందని.. ఏపీలో ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడిన కాసేపటికే ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

కొన్ని వారాలుగా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర రాజకీయ యూనియన్ల సమ్మె అన్నారు. యూనియన్ ఎన్నికల కోసమే పనికిమాలిన సమ్మెలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ అసంబద్ధమైందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అసాధ్యం అని మరోసారి తేల్చి చెప్పారు. నాలుగేళ్ల కాలంలో 67శాతం కార్మికుల జీతాలు పెంచినా గొంతెమ్మ కోర్కెలు కోరడం దారుణం అన్నారు. పనిలో పనిగా ఏపీలో ఆర్టీసీ విలీనం అంశంపైనా కేసీఆర్ స్పందించారు.

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన సీఎం జగన్.. దీనిపై కమిటీ వేస్తున్నట్లు ఆర్డర్ మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ఆ కమిటీ 3 నెలలకో, 6 నెలలకో కథ చెబుతారట అని అన్నారు. ఈ భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది సాధ్యం కాదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఏపీలో ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలన్నారు. ఐదారు నెలలు ఆగితే ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుందన్నారు.

”సీఎం జగన్ సంగతే చెబుతున్నా నేను. జగన్ అక్కడ ప్రయోగం చేశారు. ఆర్డర్ మాత్రమే ఇచ్చారు. కమిటీ వేశారు. మన్ను కూడా జరగలేదు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఆ కమిటీ కథ చెబుతుందట. 100శాతం  ఆర్టీసీ విలీనం అసాధ్యం. అసంభవం. ఈ భూగోళం ఉన్నంతవరకు అది జరిగేది కాదు. ఆర్డర్ ఇచ్చి కమిటీ వేశారు. ఏమవుతుందో దేవుడికే ఎరుక”అని కేసీఆర్ అన్నారు.