రైతులకు సీఎం జగన్ శుభవార్త

ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. కౌలు రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా గడువు పెంచారు. డిసెంబర్‌ 15 వరకు గడువు ఇచ్చారు. అలాగే ప్రత్యేక స్పందన

  • Published By: veegamteam ,Published On : November 6, 2019 / 01:36 PM IST
రైతులకు సీఎం జగన్ శుభవార్త

ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. కౌలు రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా గడువు పెంచారు. డిసెంబర్‌ 15 వరకు గడువు ఇచ్చారు. అలాగే ప్రత్యేక స్పందన

ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. కౌలు రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా గడువు పెంచారు. డిసెంబర్‌ 15 వరకు గడువు ఇచ్చారు. అలాగే ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. సాధారణ రైతులు మాత్రం నవంబర్ 15లోగా రైతు భరోసా పథకాన్ని వినియోగించుకోవాలని సీఎం చెప్పారు. ఈ పథకం కింద లబ్ది పొందే రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే శనివారం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించి వాటిని పరిష్కరించాలని కల్లెక్టర్లను ఆదేశించారు. రైతు భరోసా అమలులో భాగంగా కౌలు రైతులకు గడువు పెంచినట్లు సీఎం తెలిపారు.

‘రబీ సీజన్‌ ఇప్పుడే మొదలైంది. కౌలు రైతులకు గడువు పెంచుతున్నాం. రైతుల్లో, కౌలు రైతుల్లో అవగాహన పెరిగి ఇప్పడిప్పుడే సాగు ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో వారికి మాత్రమే డిసెంబర్‌ 15 వరకు గడువు ఇస్తున్నాం’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

జగన్ ప్రభుత్వం ప్రతిష్టా‍త్మకంగా ప్రవేశపెట్టిన పథకం వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 40 లక్షల 84 వేల మందికి లబ్ది చేకూరిందని అధికారులు తెలిపారు. పథకం అమలులో భాగంగా బుధవారం(నవంబర్ 6,2019) లక్షా 7 వేల రైతు కుటుంబాలకు రూ.97 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అదే విధంగా ప్రతీ బుధవారం కొత్త లబ్దిదారులకు రైతు భరోసా కింద సాయం అందజేస్తామన్నారు. 

నవంబర్ 15 నాటికి అర్హులైన రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం చెప్పిన మేరకు నవంబర్ 9న రైతు భరోసా కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతీ మండలంలో తహశీల్దార్‌, వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో అర్హులైన రైతుల అర్జీలు పరిష్కరిస్తామని అధికారులు వెల్లడించారు.