ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరాలు..50 శాతం మహిళలకే

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 07:43 AM IST
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరాలు..50 శాతం మహిళలకే

‘స్పందన’కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అన్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జిల్లా స్థాయిలో  50 శాతం ఉద్యోగాలు మహిళలకేనని స్పష్టం చేశారు.  

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తరువాతనే అధికారులు జీతాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  డిసెంబర్ 15లోపు ఉద్యోగాలకు సంబంధించిన జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.  జనవరి 1 నుంచి ప్లేస్ మెంట్ ఆర్డర్స్ వస్తాయన్నారు. ప్రతీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి ఒక కోడ్ నంబర్ ఉంటుందనీ అది అధికారులు ఆయా ఉద్యోగులకు ఇస్తారని తెలిపారు. నెలకు రూ.30 వేలలోపు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఉద్యోగులకు సంబంధించి ప్రతీ కాంట్రాక్టును ఒక ఏంటీటీగా తీసుకోవాలనీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన  50శాతం మంది ఉన్నారో లేదో చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనికి జిల్లా స్థాయిలో ఇన్ ఛార్జ్ మంత్రి అప్రూవల్  అథారిటీగా ఉంటారని..జిల్లా కమిటీకి జిల్లా కలెక్టర్ నేతృత్వం వహిస్తారని  సీఎంతెలిపారు.  
 
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియమాకాల్లో మధ్యవర్తుల సమస్యలే ఉండవనీ..వారిని పూర్తిగా తొలగిస్తామన్నారు. ఉద్యోగాలు ఇచ్చేందుకు మధ్యవర్తులు లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడుతున్నారనీ అందుకే వారిని పూర్తిగా తొలగిస్తామనీ.. ఉద్యోగ నియామకాల్లో  అవినీతికి ఆస్కారం ఉండకూదనే తమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. 
ప్రతీ  ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన  50శాతం మంది ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.