మన పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా చేయాలా వద్దా : నన్ను టార్గెట్ చేసిన పెద్ద మనుషులు చెప్పండి

ఏపీలో మీడియం గొడవపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలను సీఎం

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 06:57 AM IST
మన పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా చేయాలా వద్దా : నన్ను టార్గెట్ చేసిన పెద్ద మనుషులు చెప్పండి

ఏపీలో మీడియం గొడవపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలను సీఎం

ఏపీలో మీడియం గొడవపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలను సీఎం జగన్ ఖండించారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా చేయాలా వద్దా అని ప్రశ్నించారు. పిల్లలు భావితరంతో పోటీ పడాలంటే మార్పు తేవాల్సిందే అన్నారు. మీ పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.. పేద పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలా అని జగన్ నిలదీశారు. నేనే చేస్తుంది తప్పు అన్నట్లు.. తనను వ్యక్తిగతంగా, రాజకీయంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్న వారు.. మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో సమాధానం చెప్పాలని సీఎం జగన్ అడిగారు.

ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. మన పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. తెలుగు మీడియంలోనే చదివితే పిల్లల తలరాతలు మారవు అని సీఎం స్పష్టం చేశారు. ఎవరూ చదివించని గవర్నమెంటు బడులను అలాగే వదిలేయాలా అని సీఎం జగన్ నిలదీశారు. ఈ తరం పిల్లలను ఎక్కడైనా బతికేలా తీర్చిదిద్దాలన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే పేద పిల్లలు నైపుణ్యం లేని వారిగానే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.

పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం అన్న సీఎం జగన్.. నాడు-నేడు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మూడు దశల్లో మనబడి నాడు-నేడు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మొదటి దశలో 15వేల 715 స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. 2020 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉంటుందన్నారు. రాష్ట్రంలో 45వేల ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయని చెప్పారు. ప్రతి స్కూల్ లో ఇంగ్లీష్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో పని చేసే టీచర్లకు కూడా ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తామన్నారు.