తెలుగు మీడియంలో చదివితే పిల్లల తలరాతలు మారవు

తెలుగు మీడియంలోనే చదివితే మన పిల్లల తలరాతలు మారవని సీఎం జగన్ అన్నారు. ఇంగ్లీష్ రాకపోతే పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు.

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 07:29 AM IST
తెలుగు మీడియంలో చదివితే పిల్లల తలరాతలు మారవు

తెలుగు మీడియంలోనే చదివితే మన పిల్లల తలరాతలు మారవని సీఎం జగన్ అన్నారు. ఇంగ్లీష్ రాకపోతే పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు.

తెలుగు మీడియంలోనే చదివితే మన పిల్లల తలరాతలు మారవని సీఎం జగన్ అన్నారు. మరో పదేళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోందన్నారు. ఎక్కడ చూసినా ఇంటర్ నెట్ కనిపిస్తోందన్నారు. ఇంగ్లిష్ చదువులు లేకపోతే మన పిల్లల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. గురువారం (నవంబర్ 14, 2019) ప్రకాశం జిల్లా ఒంగోలులో నాడు-నేడు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం జగన్ మాట్లాడుతూ విద్యార్థులు.. రేపటి సమాజ నిర్మాతలు అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 శాతం మంది చదువురాని ఉన్నారని తెలిపారు. 

మన పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే వారి భవిష్యత్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాలన్నారు. 
ఎవరూ చదివించని గవర్నమెంట్ బడులను అలాగే విదిలేయాలా అని ప్రశ్నించారు. సరైన సమయంలో సరైనా నిర్ణయం తీసుకోకపోతే తల రాతలు మారవన్నారు. పేదవారు చదువుకునే బడులను పేదల దేవాలయాలుగా మార్చడానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ప్రజల తలరాతలు అలాగే ఉండాలని వదిలేసి, కార్పొరేట్ చదువులకు కొమ్ముకాయాలా.. ప్రభుత్వ బడులను వదిలేయాలా అన్నది మన ముందున్న సవాల్ అన్నారు.

మార్పు రావాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. పేదవాడు తెలుగు మీడియంలోనే చదవాలని సంస్కృతి అంటుందని వదిలివేస్తే.. భవిష్యత్ లో అదే సంస్కృతిని, తెలుగు వాడిని పైనుంచి కిందిదాకా వెటకారంగా చూస్తే అలా వదిలి వేసిందుకు మనం సిగ్గుతో తలదించుకోనే పరిస్థితి రాదా అన్నారు. మన బడులను ఇలాగే కొనసాగించాలా లేదా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలా వద్దా చెప్పాలన్నారు. ఇంగ్లీష్ చదువులు తీసుకొచ్చి భావి ప్రపంచంతో పోటీ పడి గొప్పగా బతికే పరిస్థితులు తీసుకోవాలా లేదా ఆలోచించాలన్నారు. ఈ తరం పిల్లలను ఎక్కడైనా బతికేలా తీర్చిదిద్దాలన్నారు.

సమాజంతోనే కాకుండా ప్రపంచపు జాబ్ మార్కెట్ తోనూ పిల్లలు పోటీ పడుతున్నారని తెలిపారు. భవిష్యత్ లో ప్రపంచంతో పోటీ పడేందుకు అడుగులు వేయాలా లేదా ఆలోచించాలి అన్నారు. ఇంగ్లీష్ చదవకపోతే ప్రపంచంతో పోటీ పడలేక కూలీలుగా, డ్రైవర్లుగా మిగిలిపోయి నైపుణ్యం లేదని పిల్లలుగా ఉంటారని తెలిపారు. ఇటీవలికాలంలో డ్రైవర్ లెస్ వెహికల్ వస్తుండటంతో చివరికి డ్రైవర్ల ఉద్యోగాలు ఉంటాయా లేదో అనుమానంగా ఉందన్నారు.

మార్పుకు శ్రీకారం చుట్టడం తప్పా అని ప్రశ్నించారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే వ్యక్తిగతంగా, రాజకీయంగా తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. తనపై అవాక్కులు, చెవాక్కుల పేలుతున్నారని చెప్పారు. నన్ను విమర్శించే వారు హిపోక్రసీని వదిలి డెమోక్రసీలోకి రావాలన్నారు. తనను విమర్శించే వారు రాజకీయ, సినీ రంగంలో ప్రముఖ స్థానం సంపాదించిన వ్యక్తులు ఉన్నారని, వైస్ ప్రెసిడెంట్ పదవుతుల్లో ఉన్నారని తెలిపారు. తనను విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలన్నారు. మీ బిడ్డలు, మనవళ్లు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి..పేదవారు చదవకూడదా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ రాకపోతే పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. 

ఏ కొందరో బాగుపడితే….సమాజం బాగుపడదని..అందరూ బాగుపడితేనే ఆంధ్ర రాష్ట్రం, సమాజం బాగు పడుతుందన్నారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. దొంగలు కూడా ఎత్తుకుపోలేని ఆస్తి, నిజమైన సంపద చదువు అన్నారు.