శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకు బ్రేక్… సీఎం జగన్ సమీక్ష

సీఎం జగన్ ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. మండలి వ్యవహారంపై సీఎం జగన్ సమీక్షించారు.

  • Published By: veegamteam ,Published On : January 22, 2020 / 06:02 PM IST
శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకు బ్రేక్… సీఎం జగన్ సమీక్ష

సీఎం జగన్ ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. మండలి వ్యవహారంపై సీఎం జగన్ సమీక్షించారు.

సీఎం జగన్ ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలను జగన్ కు వివరించారు. మండలి వ్యవహారంపై సీఎం జగన్ సమీక్షించారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై న్యాయ సలహాలతో పాటు ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చించారు. బిల్లులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై సమాచాలోచన చేస్తున్నారు. ప్రభుత్వం ముందున్న అవకాశాలపై చర్చించారు. న్యాయ సలహాలు తీసుకోవడంతో పాటు ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా చర్చించారు.

ఏపీ శాసనమండలిలో టీడీపీ పట్టు నిలుపుకుంది. ముందు నుంచి చెప్తున్నట్లుగా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంలో టీడీపీ సక్సెస్ అయింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేకులు పడ్డాయి. శాసన మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపారు. తనకున్న విచక్షణాదికారాలతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు. ఛైర్మన్ రూలింగ్ పై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఛైర్మన్ తీరుని తప్పుబట్టారు. 

అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను.. సెలక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో మూడు నెలలు రాజధానుల అంశం పెండింగ్‌లో పడినట్లే. ఈ అంశంపై రోజంతా శాసన మండలిలో ప్రతిష్టంభన ఏర్పడగా.. బిల్లులపై ఓటింగ్ జరపాలని.. అధికారపక్షం.. సెలక్ట్ కమిటీకి పంపాల్సిందేనంటూ ప్రతిపక్షం మండలి చైర్మన్ ముందు తమ వాదనలు వినిపించాయి. ముందుగా రెండు బిల్లులపై చర్చ నిర్వహించారు మండలి చైర్మన్. అందరూ ప్రసంగించిన తర్వాత.. అసలు విషయం తెరపైకి వచ్చింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని ముందుగానే తెలుగుదేశం పక్ష నేత యనమల రామకృష్ణుడు నోటీసులు ఇచ్చారు. అయితే.. అవి సాంకేతికంగా మూవ్ కాలేదని.. చైర్మన్ చెప్పారు.

దీంతో మంత్రులు సెలక్ట్ కమిటీకి బిల్లును పంపే అధికారం చైర్మన్‌కు లేదంటూ బిల్లులపై ఓటింగ్ జరపాలని పట్టుబట్టింది అధికార పార్టీ. అయితే ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదని గట్టి పట్టుదలతో ఉన్న వైసీపీ సర్కార్ వ్యూహం మాత్రం చివరకు విఫలం అయ్యింది. ఈ బిల్లు సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతోంది. అయితే రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వంకు చివరకు గట్టి ఎదురుదెబ్బే తగిలినట్లు అయ్యింది. 

మరోవైపు ఈ బిల్లు విషయంలో ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారిపై అనర్హత వేటు వేయించడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకు భిన్నంగా ఓటింగ్ నేపథ్యంలోనే మరింత మంది టీడీపీ సభ్యులను తమ వైపు లాగేయాలని వైసీపీ కిందామీద పడింది. ఇందుకోసం మంత్రులు అత్యధిక సమయం పాటు శాసనమండలిలోనే గడిపారు. దీంతో అక్కడ వాడీవేడి వాతావరణం నెలకొనగా.. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహమే ఫలించింది.