గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ రివ్యూ

  • Published By: madhu ,Published On : September 11, 2019 / 10:28 AM IST
గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ రివ్యూ

గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన పరీక్షలను విజయవంతంగా నిర్వహించారంటూ సీఎం జగన్ అధికారులను అభినందించారు. అక్టోబర్ 02వ తేదీ నుంచి సచివాలయాలు ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సెప్టెంబర్ చివరి వారంలో పరీక్షా ఫలితాలను వెల్లడిస్తామన్నారు అధికారులు.
 
4 నెలల వ్యవధిలో 4 లక్షలకు పైగా నియామకాలు చేశామని తెలిపారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీరర్లకు ఉద్దేశించిన కాల్ సెంటర్లలో ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై స్పందించడానికి గ్రామ సెక్రటేరియట్ కు ప్రత్యేకంగా ఒక నెంబర్ ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం జగన్. 72 గంటల్లోగా సమస్యను పరిష్కరించేలా ఏర్పాట్లు ఉండాలని, గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్ ఉండాలన్నారు. 

గ్రామ సచివాలయానికి రాష్ట్ర సచివాలయానికి అనుసంధానం కలిగి ఉండాలని సూచించారు. ఆయా పథకాల లబ్దిదారుల జాబితాను సచివాయాల్లో ఉంచాలన్నారు. ఫించన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్  లోపు అందచేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు. 
Read More : ఖాళీ చేయిస్తున్న పోలీసులు : టీడీపీ శిబిరం నుంచి బాధితుల తరలింపు