2 కొత్త కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం : 56లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు

ఏపీ సీఎం జగన్ కర్నూలు నుంచి రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్టు జగన్ చెప్పారు. అలాగే మూడో

  • Published By: veegamteam ,Published On : February 18, 2020 / 07:50 AM IST
2 కొత్త కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం : 56లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు

ఏపీ సీఎం జగన్ కర్నూలు నుంచి రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్టు జగన్ చెప్పారు. అలాగే మూడో

ఏపీ సీఎం జగన్ కర్నూలు నుంచి రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్టు జగన్ చెప్పారు. అలాగే మూడో దశ కంటి వెలుగును నేటి(ఫిబ్రవరి 18,2020) నుంచి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేస్తామన్నారు జగన్. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని పీహెచ్ ప్రమాణాలకు తీసుకొస్తామన్నారు.

జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రూ.15వేల 337 కోట్లతో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో సీఎం జగన్ మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3వ దశలో 56.88 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేస్తామన్నారు. 3వ దశ కంటి వెలుగును కర్నూలు నుంచి ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు సీఎం జగన్. అవ్వా తాతలకు ఎంత చేసినా తక్కువే అన్నారు సీఎం జగన్. 

* కర్నూలులో వైఎస్ఆర్ కంటి వెలుగు-3 ప్రారంభం
* జూలై 31వ తేదీ వరకు కొనసాగనున్న కంటి వెలుగు కార్యక్రమం
* 56 లక్షల 88వేల 424మందికి స్క్రీనింగ్ పరీక్షలు
* రెండు కొత్త కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
* ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు

* అత్యున్నత ప్రమాణాలతో ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిద్దుతాం
* మూడేళ్లలో ఆసుపత్రుల రూపురేఖలు మార్చేస్తాం
* రూ.15వేల 337 కోట్లతో ఆసుపత్రుల ఆధునికీకరణ
* 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల రూపురేఖలు మారుస్తాం
* 52 ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ

* ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి రూ.700 కోట్లు
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐపీహెచ్ఎస్ ప్రమాణాలు తీసుకొస్తాం
* జిల్లా ఆసుపత్రులనూ అభివృద్ధి చేస్తాం
* అవ్వా తాతలకు ఎంత చేసినా తక్కువే
* అవ్వా తాతలకు కంటి చూపు ఇబ్బందులు రాకుండా కంటివెలుగుకి శ్రీకారం
* నేటి నుంచి 175 నియోజకవర్గాల్లో కంటి వెలుగు
* మొత్తం 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం