తెలుగు రాష్ట్రాల్లో యూపీ సీఎం ఎన్నికల ప్రచారం

10TV Telugu News

తెలుగు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ పర్యటించనున్నారు. తెలంగాణలో పట్టుసాధించాలనుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడింది. ఈ క్రమంలో తెలంగాణ లోక్ సభ..ఏపీలో అసెంబ్లీ..లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు సాధించుకోవాలనే లక్ష్యంతో యూపీ సీఎం యోగీ పర్యటించనున్నారు. ఏపీలో ఈసారి గణనీయ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్న బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన తెలంగాణలో రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో యోగీ ఇటు తెలంగాణలోను అటు ఏపీలోను పర్యటించనున్నారు. 
 

 కాగా ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా సహా కేంద్రమంత్రులు ఇది వరకే ఓసారి ఏపీలో ప్రచారం చేసి వెళ్లారు.  ఈ రోజు (ఏప్రిల్ 7) యోగి ఆదిత్యనాథ్ ఏపీకి రానున్నారు. చిత్తూరులో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఆయన రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.  ఏపీ పర్యటనకు ముందు తెలంగాణలోని పెద్దపల్లి పట్టణంలోని జూనియర్ కాలేజీలో బీజేపీ బహిరంగ సభలో ఆదిత్యనాథ్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత జహీరాబాద్‌లోని యల్లారెడ్డిలో ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలలో జరిగే ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొంటారు.