ఎంత పని చేసింది : పాము కారణంగా రూ.4లక్షలు నష్టం

అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ పాము తెచ్చిన తంటాతో ట్రాన్స్‌కోకు 4 లక్షల నష్టం ఏర్పడింది.

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 05:48 AM IST
ఎంత పని చేసింది : పాము కారణంగా రూ.4లక్షలు నష్టం

అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ పాము తెచ్చిన తంటాతో ట్రాన్స్‌కోకు 4 లక్షల నష్టం ఏర్పడింది.

అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ పాము తెచ్చిన తంటాతో ట్రాన్స్‌కోకు 4 లక్షల నష్టం ఏర్పడింది. హిందూపురం మండలం తూమకుంట సబ్‌ స్టేషన్‌ ఫీడర్‌లోకి ఓ నాగుపాము దూరింది. ఫీడర్‌లోకి నాగుపాము ప్రవేశించి విద్యుత్‌ పరికరాలను తాకడంతో అందులోని ఫ్యూజులు, క్యాంపులు, వైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ట్రాన్స్‌కోకు నాలుగు లక్షల నష్టం వాటిల్లింది.

మరోవైపు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాదు.. తూమకుంట, గోళ్లాపురం పారిశ్రామికవాడలోని సుమారు 40 పరిశ్రమల్లో పనులు నిలిచిపోయాయి. అలాగే శ్రీకంఠపురం – లేపాక్షి సబ్‌స్టేసన్‌లో సమస్య తలెత్తింది. అసలు ఏమి జరిగిందో తెలియక అధికారులు ఆందోళన చెందారు. చివరికి ఫీడర్‌లో పామును గుర్తించి దాన్ని బయటకు తీసి చంపివేశారు.

Also Read : చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ