బరిలో వైసీపీ, టీడీపీ కోడి పుంజులు

  • Published By: vamsi ,Published On : January 17, 2020 / 04:28 AM IST
బరిలో వైసీపీ, టీడీపీ కోడి పుంజులు

సంక్రాంతి అంటే గోదావరి జిల్లాల్లో కోడిపందేల హడవుడే ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి అనగానే అక్కడ పుంజులను బరిలో దింపి అందరూ హడావుడి చేస్తుంటారు. ఈసారి కూడా సంక్రాంతికి కోడిపుంజులు బరిలోకి దిగాయి. అయితే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో సంక్రాంతి సంధర్భంగా జరిగిన కోడి పందేలు ఆసక్తికరంగా అనిపించాయి. అందుకు కారణం బరిలో నిలిచింది వైసీపీ పుంజు.. టీడీపీ కోడి పుంజు.

CocK Fight

వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడి పందాలు ఆడారు.  నర్సాపురంలో సంక్రాంతి పండుగ రోజు సరదాగా గడిపిన ఇద్దరు ప్రత్యర్థులుగా కోళ్లను బరిలోకి దింపారు.. సై అంటే సై అంటూ కోళ్లను బరిలో దింపారు. ఈ సరదా సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలను మంత్రి గంటా తన ఫేస్‌బుక్ పేజ్‌లో అందరితో పంచుకున్నారు.

కోళ్లు

రాజకీయాల్లో ప్రత్యర్థులైనా పండుగ సమయంలో అవన్నీ పక్కన పెట్టి సరదాగా గడుపుతూ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గంటా శ్రీనివాసరావు సంక్రాంతి పండుగ రోజు అతిథిగా నర్సాపురం వెళ్లారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రమే కాదు.. నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు కూడా గంటాతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. 

ఇకపోతే తాను పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన వార్తలను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఖండించారు. పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు.. విశాఖ రాజధానిపై తన వ్యాఖ్యల్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.