నెల రోజుల్లో మిషన్ భగీరథ పూర్తి : సీఎం కేసీఆర్

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 01:56 PM IST
నెల రోజుల్లో మిషన్ భగీరథ పూర్తి : సీఎం కేసీఆర్

వనపర్తి : మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని.. నెల రోజుల్లో పూర్తవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గద్వాలలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు. ఆర్డీఎస్ కాలువ కింద ఉన్న 87 వేల 500 ఎకరాలకు సాగు నీరు అందిస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. పాలుకారే పచ్చటి పొలాలను మనం కళ్ల చూడాలని ఆకాంక్షించారు. వనపర్తిలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగించారు.
Read Also : ఓ హాస్పిటల్.. 9మంది నర్సులు.. ఒకేసారి ప్రెగ్నెన్సీ

సంక్షేమ పథకాల్లో తెలంగాణ నెంబర్ వన్ అని అన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ కిట్ లు అందిస్తున్నామని చెప్పారు. లక్షల సంఖ్యలో గొర్రెలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. వచ్చే నెల నుంచి పింఛన్ రూ.2 వేలు ఇస్తామని చెప్పారు. 

ఎన్నికల తర్వాత ఒక్కో జిల్లాలో రెండు, మూడు రోజులు ఉంటానని తెలిపారు. ప్రజా దర్బార్ లు నిర్వహించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన పాలమూరు బిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి రాములును గెలిపించాలని కోరారు. 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 
Read Also : బీజేపీ, కాంగ్రెస్ దుకాణాలు బంద్ : సీఎం కేసీఆర్