నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన కాంగ్రెస్

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్, సీపీఎం సభ్యులు సమావేశం నుంచి బయటకు వచ్చారు.

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 07:01 AM IST
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన కాంగ్రెస్

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్, సీపీఎం సభ్యులు సమావేశం నుంచి బయటకు వచ్చారు.

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్, సీపీఎం సభ్యులు సమావేశం నుంచి బయటకు వచ్చారు. మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఓటు చెల్లదంటూ కాంగ్రెస్ నిరసన తెలిపింది. రాత్రికి రాత్రే ఓటు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుభాష్ రెడ్డిని బయటికి పంపించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ జరిపితే ఆత్మహత్య చేసుకుంటామని కాంగ్రెస్ సభ్యులు బెదిరించారు. అలాగే ఓటింగ్ జరిపే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ సభ్యులు ఎన్నికను బహష్కరించి బయటకు వచ్చారు. 

uttam

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి పేరును ఎక్స్ అఫిషియో సభ్యునిగా సుభాష్ రెడ్డి పేరును అదనంగా కలపడంతో టీఆర్ఎస్ కు ఒక సభ్యుడి బలం అదనంగా ఉందని చెప్పవచ్చు. ఉదయం 11 గంటలకు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే ప్రమాణస్వీకారం కాకముందే స్థానిక ఎంపీ ఉత్తమ్, కాంగ్రెస్ సభ్యులు సుభాష్ రెడ్డి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సుభాష్ రెడ్డిని బయటికి పంపించిన తర్వాతనే ప్రమాణస్వీకారం ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాత్రికి రాత్రే సుభాష్ రెడ్డి ఓటు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

trs

చాలా సేపు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ చంపాలాల్, జిల్లా ఎస్పీ అక్కడికి చేరుకుని ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్నారు. అధికారులు ఎంతసేపు వాదనా చేసినా గానీ కాంగ్రెస్ సభ్యులు స్వయంగా తాము లిస్టు తయారు చేయలేదు, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన లిస్టు ప్రకారమే చేస్తామని చెప్పారు. మీరు చెప్పదల్చుకున్నది ఎన్నికల సంఘం దగ్గర చెప్పుకోవాలని చెప్పారు. ఎన్నికను వాయిదా వేయబోమని, కొనసాగిస్తామని ఎన్నికల అధికారులు చెప్పడంతో కాంగ్రెస్ సభ్యులు ఛైర్మన్ ఎన్నికను బహిష్కరించారు. ఎక్స్ అఫిసియో సభ్యులుగా ఉన్న కేవీపీ, ఉత్తమ్ బయటకు వచ్చారు. చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్, సీపీఎం బహిష్కరించింది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

police