పెళ్లికొడుకు జంప్.. అమ్మాయి మెడలో తాళి..

తాళి కట్టే సమయానికి వరుడు పారిపోవడం, మరో యువకుడు ముందుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అందరి చేత శభాష్ అనిపించుకోవడం.. ఇలాంటి సీన్లు సినిమాల్లో చాలానే చూసి ఉంటారు.

  • Published By: sreehari ,Published On : December 30, 2018 / 07:01 AM IST
పెళ్లికొడుకు జంప్.. అమ్మాయి మెడలో తాళి..

తాళి కట్టే సమయానికి వరుడు పారిపోవడం, మరో యువకుడు ముందుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అందరి చేత శభాష్ అనిపించుకోవడం.. ఇలాంటి సీన్లు సినిమాల్లో చాలానే చూసి ఉంటారు.

సిద్ధిపేట: తాళి కట్టే సమయానికి వరుడు పారిపోవడం, మరో యువకుడు ముందుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అందరి చేత శభాష్ అనిపించుకోవడం.. ఇలాంటి సీన్లు సినిమాల్లో చాలానే చూసి ఉంటారు. కానీ నిజ జీవితంలో ఇలాంటివి చూసి ఉండరు, కనీసం విని కూడా ఉండరు. సినిమాను తలపించే యదార్థ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ముహూర్తం సమయానికి పెళ్లి కొడుకు పారిపోవడంతో మరో యువకుడు ముందుకొచ్చి అమ్మాయి మెడలో తాళి కట్టాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలో ఈ ఘటన జరిగింది.

వరుడు పరారీ:
2018, డిసెంబర్ 29 శనివారం ఉదయం 11 గంటలకు పెళ్లి ముహూర్తం. పెళ్లికూతురు బంధువులు పెళ్లి కొడుకుని తీసుకుని మండపానికి వస్తున్నారు. ఇంతలో వరుడు వాహనం దిగి పారిపోయాడు. దీంతో పెళ్లి కూతురు బంధువులు షాక్ తిన్నారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. తమ పరువు పోతుందని, అమ్మాయి జీవితం నాశనం అవుతుందని ఆందోళన చెందారు. ఇంతలో అనుకోకుండా ఓ యువకుడు ముందుకొచ్చి వధువు మెడలో తాళి కట్టడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

ఆదర్శంగా నిలిచాడు:
పొట్లపల్లి గ్రామానికి చెందిన రాజలింగు, భూలక్ష్మి దంపతులు తమ కుమార్తెను మేనత్త కొడుకు పందిపెల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అయితే శ్రీనివాస్‌ మరో యువతిని ప్రేమిస్తున్న విషయం తెలిసి పెళ్లి నిర్ణయం విరమించుకున్నారు. తర్వాత ముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి రమేశ్‌కిచ్చి కళ్యాణం చేయాలనుకున్నారు. ఈ మేరకు అంగీకారం కూడా జరిగిపోయింది. అయితే శ్రీనివాస్‌ తల్లి అడ్డుపడింది. తన కొడుకుతోనే పెళ్లి జరిపించాలని పట్టుబట్టింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు సరే అని ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.

కానీ తాళి కట్టే సమయానికి శ్రీనివాస్ జంప్ అయ్యాడు. దీంతో మొదట నిర్ణయించిన వరుడు రమేశ్‌, అతడి తల్లిదండ్రులతో మాట్లడగా.. పెళ్లి చేసుకునేందుకు అతడు ఓకే చెప్పాడు. దీంతో అదే మండపంలో పెళ్లి జరిగింది. రమేశ్‌ పెద్ద మనసుతో ముందుకొచ్చి వధువు మెడలో తాళికట్టి ఆమె తల్లిదండ్రుల్లో ఆనందం నింపాడు. ఓ అమ్మాయి జీవితం నాశనం కాకుండా రమేశ్ ఆదుకున్నాడని బంధువులు, స్థానికులు అతడిని ప్రశంసలతో ముంచెత్తారు.