రేపు జగిత్యాల జిల్లాలో కేసీఆర్ టూర్

జగిత్యాల: సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా బుధవారం జగిత్యాలజిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని రాజేశ్వరరావు పేట రివర్స్ పంప్ హౌస్ నిర్మాణం పనులను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రిగా రెండవసారి గెలిచిన తర్వాత కేసీఆర్ మొదటిసారి ఇక్కడకు వస్తున్నారు. పంప్ హౌస్ నిర్మాణం పనులు జూన్ లోగా పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ శరత్ చెప్పారు. ఈరోజు ఆయన రేపటి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
మొదటిరోజు ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కేసీఆర్ మంఘలవారం భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ,కన్నేపల్లి పంప్ హౌస్ అప్రోచ్ కెనాల్ పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్లను, అధికారులను అడిగి జరుగుతున్న పనుల వివరాలను తెలుసుకున్నారు. పనులు నిదానంగా జరుగుతున్న చోట వేగవంతం చేయాలని ఆదేశించారు.అనంతరం ఆయన తీగలగుట్టపల్లికి బయలుదేరి వెళ్లారు.