హ్యాండ్ శానిటైజర్లపై 18 శాతం జీఎస్టీ పెంపు : బాదుడు షురూ..అయినా కొనక ఛస్తారా..

  • Published By: nagamani ,Published On : July 15, 2020 / 05:08 PM IST
హ్యాండ్ శానిటైజర్లపై 18 శాతం జీఎస్టీ పెంపు  : బాదుడు షురూ..అయినా కొనక ఛస్తారా..

కరోనా వైరస్ వచ్చిన తరువాత అది రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో మాస్కులు, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లకు డిమాండ్ భారీగా పెరిగిన విషయం తెలిసిందే.కరోనా వైరస్ బారిన పడకుండా రక్షణ కోసం ప్రజలు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను పెద్ద ఎత్తున కొంటున్నారు. దీంతో హ్యాండ్ శానిటైజర్లు నిత్యావసరాల కేటగిరీలోకి చేరిపోయాయి. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ స్వయంగా తెలిపింది.

ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు ఆల్కహాల్ ఉత్పత్తుల క్యాటగిరీలోకి వస్తాయని..అందుకే వాటిపై 18 శాతం జీఎస్టీ వసూల్ చేయనున్నట్లు అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్‌(AAR) వెల్లడించింది. గోవాకు చెందిన స్ప్రింగ్‌ఫీల్డ్ ఇండియా డిస్టిల్లరీస్ వేసిన పిటిషన్‌పై ఏఏఆర్ ఈ విషయాన్ని తెలిపింది. స్ప్రింగ్‌ఫీల్డ్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న హ్యాండ్ శానిటైజర్లపై జీఎస్టీని మినహాయించాలని AARను కోరింది. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు హెచ్ఎస్ఎన్ 3808 కిందకు వస్తాయని, వాటికి 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని ఏఏఆర్ తెలిపింది.