డాక్టర్ గణపయ్య : కరోనా రోగులకు వైద్యం..అసిస్టెంట్ గా ఎలుక సేవలు

  • Published By: nagamani ,Published On : August 22, 2020 / 02:31 PM IST
డాక్టర్ గణపయ్య : కరోనా రోగులకు వైద్యం..అసిస్టెంట్ గా ఎలుక సేవలు

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో బెంగళూరులో ఓ గణపతి ఆకట్టుకుంటున్నాడు.
కరోనా కాలం స్టైల్లో డాక్టర్ గణపయ్య కరోనా పేషెంట్ కు ట్రీట్ మెంట్ చేస్తున్నాడు..గణపయ్యకు అసిస్టెంట్ గా ఆయన వాహన అయి ఎలుక డ్యూటీ చేస్తోంది. డాక్టర్ వినాయకుడు తెల్ల కోటు వేసుకుని చెవుల్లో స్టెత్ స్కోప్ పెట్టుకుని కరోనా పేషేంటుకు పరీక్షలు చేస్తుండగా ఆయన వాహనం ఎలుక గణపయ్య వెంటనే ఉండి అసిస్టెంట్ గా పనిచేస్తోన్న విగ్రహం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



బెంగళూరుకు చెందిన శిల్పి శ్రీధర్ ఈ కరోనా కాలంలో ఈ సరికొత్త డాక్టర్ వినాయకుడిని తయారుచేశారు. దీంట్లో డాక్టర్ గణేశుడు భలే ఉన్నాడు. కరోనా బాధితునికి డాక్టర్ గణేశ్ వైద్యం అందిస్తున్నట్టు..గణేశుడు డాక్టర్లు వేసుకునే తెల్ల కోటు ధరించి, మెడలో స్టెతస్కోపుతో కనిపిస్తున్నాడు. గణేశుని వాహనమైన ఎలుక కూడా సాయంగా కనిపిస్తుంది. యావత్ ప్రపంచం వైరస్‌తో పోరాడుతున్న వేళ డాక్టర్లు అందిస్తున్న సేవలకు ప్రతిరూపంగా దీన్ని తయారు చేశాననీ..కరోనా మహమ్మారి పారిపోవాలని అందరూ ప్రార్థించాలని శ్రీధర్ కోరుకుంటున్నారు.



కాగా వినాయక చవితి వేడుక వచ్చిందంటే చాలు విగ్రహాలు తయారు చేసే శిల్పులు వివిధ అవతారాల్లో వినాయకుడిని తయారు చేస్తుంటారు. ప్రతీ సంవత్సం ఇది జరుగుతునే ఉంటుంది. ఆయా ట్రెండ్ కు తగినట్లుగా వినాయకులను తయారు చేస్తుంటారు. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది కాబట్టి విగ్రహాల తయారు చేసే శ్రీధర్ ఇలా డాక్టర్ వినాయకుడ్ని తయారు చేయటంతో దానికి సంబంధంచిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



కరోనా కాలం కాబట్టి ప్రజలంతా సమన్వయంతో వీధుల్లో మండపాల కంటే ఇళ్లలోనే ఎక్కువ మంది పూజలు చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం షరుతలతో కూడిన అనుమతులతో గణనాథుల ప్రతిమలు వెలిశాయి. వీటిల్లో వివిధ ఆకృతుల్లో వినాయకుడు దర్శనమిస్తున్న క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో డాక్టర్ గణపయ్య ఎంతో ఆకట్టుకుంటోంది.