పశ్చిమగోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

  • Published By: chvmurthy ,Published On : April 1, 2020 / 06:40 AM IST
పశ్చిమగోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి  భయపెడుతోంది. నానాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 43 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  మంగళవారం రాత్రి 9 గంటలునుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య కొత్తగా 43 కేసులు నమోదయ్యాయన వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 14 మందికి కరోనా  పాజిటివ్ కేసులు నమోదవటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

దీంతో ఇప్పటి వరకు ఏపీలో కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 58 కి చేరింది. ఏలూరులో ఆరు, భీమవరంలో రెండు, పెనుగొండలో రెండు, ఉండి, గొండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కోక్కటి  చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు.  జిల్లాలో మొత్తం 30 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా…14 మందికి పాజిటివ్ 10 మందికి నెగెటివ్ రాగా మరోక 6 రిపోర్టులు రావాలని ఆయన తెలిపారు. 

Also Read | 14 వరకు మద్యం షాపులు బంద్