ఏపీలో కరెన్సీ నోట్లతో కరోనా.. నిజమెంత..

కరోనా ఎలా వస్తుంది? ఎలా వ్యాప్తిస్తుంది? ఇప్పటికీ అంతుబట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపించిందని తొలుత భావించారు. తర్వాత సీన్ మారిపోయింది.

  • Published By: veegamteam ,Published On : April 16, 2020 / 01:44 AM IST
ఏపీలో కరెన్సీ నోట్లతో కరోనా.. నిజమెంత..

కరోనా ఎలా వస్తుంది? ఎలా వ్యాప్తిస్తుంది? ఇప్పటికీ అంతుబట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపించిందని తొలుత భావించారు. తర్వాత సీన్ మారిపోయింది.

కరోనా ఎలా వస్తుంది? ఎలా వ్యాప్తిస్తుంది? ఇప్పటికీ అంతుబట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపించిందని తొలుత భావించారు. తర్వాత సీన్ మారిపోయింది. ఎక్కడకీ వెళ్లకుండానే(ట్రావెల్ హిస్టరీ)..కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో డాక్టర్లు తలల పట్టుకుంటున్నారు. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి పకడ్బందిగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయినా. కేసుల సంఖ్య తక్కువ కావడం లేదు. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఏపీలో కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాపిస్తోందనే వార్త కలకలం రేపింది. తూర్పుగోదావరి, గుంటూరు తదితర జిల్లాల్లో పలు ఉదంతాలు వెలుగు చూశాయని ప్రచారం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి ఓ లేఖ కూడా వచ్చింది. ప్రజలు సాధ్యమైనంత వరకు డిజిటల్ చెల్లింపులు చేయాలని పోలీసులు సూచించారు.

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందనే వార్త ఏపీలో దుమారం రేపింది. ప్రజలను భయాందోళనకు గురి చేసింది. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి అనేది వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు. సదరు మెసేజ్‌లో ఉన్న విషయం నిర్ధారణ కాలేదన్న డీజీపీ, అది ఒక అనుమానం మాత్రమేనని తేల్చి చెప్పారు. సాధ్యమైనంత వరకు డిజిటల్ ట్రాన్సక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పారు. 

ఇక కరోనాపై సోషల్ మీడియాలో వస్తున్న ఫేస్ న్యూస్ ను అరికట్టేందుకు వాట్సప్ నెంబర్ ని అందుబాటులో తీసుకొచ్చారు ఏపీ పోలీసులు. 90716  66667…నెంబర్ ని ఏపీ డీజీపీ సవాంగ్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలని ఆ నెంబర్ కు వాట్సప్ చేస్తే …ఆయా వర్గాలతో క్లారిటీ తీసుకొని తిరిగి వాస్తవ సమాచారం అందించనున్నారు పోలీసులు.

ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య 500 దాటింది. వీటిల్లో ఎక్కువగా… ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటివరకు 16 మంది డిశ్చార్జ్ కాగా… 9మంది మరణించారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 458గా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.(భారత్ సహా 22 దేశాలలో 10వేల కంటే ఎక్కువ కరోనా కేసులు )