విశాఖలో ఆన్‌లైన్ చారిటీ డొనేషన్ పేరుతో టోకరా: నైజీరియన్స్ గ్యాంగ్ అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 06:50 AM IST
విశాఖలో ఆన్‌లైన్ చారిటీ డొనేషన్ పేరుతో టోకరా: నైజీరియన్స్ గ్యాంగ్ అరెస్ట్

విశాఖపట్నంలో మరో ఘరానా మోసం బైటపడింది. ఆన్ లైన్ లో చారిటీ డొనేషన్ పేరుతో పాల్పడుతున్న మోసాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. దీనికి సంబంధించి నైజీరిన్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో చారిటీ డొనేషన్ పేరుతో నైజీరియన్ గ్యాంగ్ టోకరా వేసినట్లుగా గుర్తించారు. 

ఓ చారిటీకి రూ.39 కోట్లు దానం చేస్తున్నట్లుగా..ఓ మహిళ నుంచి విశాఖకు చెందిన సంజయ్ సింగ్ కు మెయిల్ వచ్చింది.సదరు మహిళ చేసిన మెయిల్ కు సంజయ్ సింగ్ రిప్లై ఇచ్చాడు. తాము డొనేట్ చేసిన డబ్బు చేతికి రావాలంటే కొంత డబ్బును తమ ఎకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని ఆమె తిరిగి చెప్పింది. దీంతో సంజయ్ సింగ్ ఆమె వలలో చిక్కుకున్నాడు. వెంటనే సంజయ్ సింగ్ వివిధ బ్యాంకుల ఎకౌంట్స్ లో రూ.6లక్షల 62 వేలను వేశాడు.

కానీ సదరు కిలాడీ లేడీ పేరుతో వచ్చిన మెయిల్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. డొనేట్ చేస్తానన్న డబ్బులూ రాలేదు. దీంతో ఎంతకూ తనకు డబ్బులు రాకపోవటంతో మోసపోయానని గ్రహించిన సంజయ్ సింగ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సంజయ్ సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. పలు ఆధారాలతో నలుగురు నైజీరియన్స్ తో పాటు మేఘాలయాకు చెందిన ఓ మహిళను అరెస్ట్ చేశారు.  వారి నుంచి 3 ల్యాప్ టాప్ లు, 6 మొబైల్ ఫోన్లు, రూ.55వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారి పేరుతో బ్యాంకులో ఉన్న రూ.లక్షన్నరను ఫ్రీజ్ చేశారు.