ఏపీలో బెల్ట్ షాపులు పోయి..మొబైల్ షాపులు వచ్చాయి

  • Publish Date - December 16, 2019 / 05:40 AM IST

సీఎం జగన్ ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామంటూ..ఎక్సైజ్ పాలసీ నుంచి కాసుల వర్షం కురిపించేలా చేసుకుంటున్నారనీ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో మద్య నిషేధంపై చర్చ కొనసాగుతున్న సందర్భంగా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య విమర్శల వర్షం కురుస్తోంది.

ఈ క్రమంలో రామానాయుడు మాట్లాడుతూ..బెల్ట్ షాపులను బంద్ చేస్తున్నామంటున్న ప్రభుత్వ నేతలు బెల్ట్ షాపుల్ని బంద్ చేసి మొబైల్ మద్యం షాపుల్ని తీసుకొస్తున్నారనీ..వైన్ షాపుల నుంచి  బార్లకు అక్రమంగా మద్యం సరఫరా అవుతోందని ఆరోపించారు. ఇదేనా మద్య నిషేధం అంటూ ప్రశ్నించారు. 

మద్యం ధరలు పెరిగితే వినియోగం తగ్గుతందని ప్రభుత్వం అంటోందనీ.. కానీ ఆర్టీసీ చార్జీలు పెంచారు..మరి ప్రయాణీకులు తగ్గాలనీ ప్రభుత్వం అభిప్రాయపడుతోందా? అంటూ ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నించారు. ఎక్సైజ్ పాలసీ వైసీపీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోందనీ..పరిమితమైన బ్రాండ్లతో జె-ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారనీ ఆరోపించారు. 

ట్రెండింగ్ వార్తలు