కూతురు బోయ్ ఫ్రెండ్ ని కుళ్లుబొడిచేసిన ఐపీఎస్ : సిగిరెట్ తో కాల్చి..చంపేస్తానని వార్నింగ్

  • Published By: nagamani ,Published On : August 14, 2020 / 08:55 AM IST
కూతురు బోయ్ ఫ్రెండ్ ని కుళ్లుబొడిచేసిన ఐపీఎస్ : సిగిరెట్ తో కాల్చి..చంపేస్తానని వార్నింగ్

cigarettea

ఓ ఐపీఎస్ అధికారి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది పోలీసులతో నా కొడుకుని పశువుని బాదినట్లుగా బాదారని..సిగిరెట్ తో కాల్చి నానా చిత్రహింసలకు గురిచేశారని ఓ బాలుడి తల్లిదండ్రులు ఆవేదన. అది నిజం కాదు ఆ అబ్బాయి నాకూతురు వెంట పడుతున్నాడనీ..ప్రేమించాలంటూ లైంగిక వేధిస్తున్నాడనీ..సోషల్ మీడియాలో తన కూతురు గురించి అసభ్యంగా పోస్టులు పెడుతూ వేధిస్తున్నారనీ..ఆ ఐపీఎస్ అధికారి ఆరోపణలు..ఇదీ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో పోలీసు మెడ్ క్వార్టర్స్ లో ఓ కేసు ఫిర్యాదులో జరుగుతున్న పరిణామాలు.

వివరాల్లోకి వెళితే..డెహ్రూడూన్ కు చెందిన 18 ఏళ్ల బాలుడుని ఓ ఐపీఎస్ అధికారి తన కూతురు ఓ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయటాన్ని సహించలేకపోయాడు. తన అధికారాన్ని ఉపయోగించి అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు. తరువాత అతన్ని నలుగురు పోలీసులు ఆ అబ్బాయి బట్టలు విప్పేసి దారుణంగా కొట్టారు. పోలీసు దెబ్బలు రుచి చూసి ఆ లేత వయస్సు కుర్రాడు తట్టుకోలేకపోయాడు. లాఠీలతో ఒళ్ళు కుళ్లబొడిచేస్తుంటే హాహాకారాలు చేశాడు. అక్కడికీ ఆ ఐపీఎస్ అధికారి ఆగ్రహం తగ్గలేదు. ఆకుర్రాడిని చెంపలు వాయించాడు..సిగిరెట్ తో చేతులపై కాల్చాడు. అలా ఆ అబ్బాయిని ఇష్టానుసారంగా కొట్టి..ఫో..ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి పంపేశారు.

కానీ ఒళ్లంతా దెబ్బలతో ఇంటికి వచ్చిన కొడుకుని చూసి అతని తల్లిదండ్రులు అల్లాడిపోయారు. జరిగిందేమిటో తెలుసుకున్నారు. వెంటనే కుర్రాడిని తీసుకుని డెహ్రాడూన్ పోలీస్ హెడ్ క్వార్డర్స్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. అధికారం చేతిలో ఉంది కదాని ఇలా గొడ్డును బాదినట్లుగా బాదుతారా? మాకు న్యాయం చేయండి అంటూ కోరారు.

దీంతో పోలీసు అధికారులు అతన్ని వైద్య పరీక్షలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తరలించగా..కుర్రాడిపై దాడి జరిగిందనీ చాలా దారుణంగా దెబ్బలు తగిలాయనీ..అతని పిరుదుల క్రింద..బహుమూలల్లోను గాయాలయ్యాయని అతని చేతిపై సిగిరెట్ తో కాల్చిన గాయాలున్నాయని కనీసం నలుగురు ఈ దాడి చేసారని రిపోర్ట్ వచ్చింది.

దీనిపై సదరు ఐపీఎస్ అధికారిని విచారించగా..కుర్రాడి తరపు ఆరోపణలను తోసిపుచ్చుతూ..ఎదురు ఆరోపణలు చేశాడు. నేను ఆ కుర్రాడని స్టేషన్ కు పిలవలేదనీ దాడి చేయాలేని బొంకాడు..పైగా నా కూతురిని సదరు అబ్బాయి లైంగికంగా వేధిస్తున్నాడని..సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్ లు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించాడు.
ఇలా ఇరు వర్గాల ఆరోపణలు..ఫిర్యాదులపై డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) అశోక్ కుమార్ దర్యాప్తుకు ఆదేశించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని డెహ్రాడూన్‌ ఎస్పీ సిటీ శ్వేతా చౌబేకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఎస్సీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కాగా.. బాధితుడు తండ్రి మాట్లాడుతూ..నా కుమారుడు ఏదైనా తప్పు చేసి శిక్షించండి చట్టబద్దంగా..కానీ ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యేలోగా నా కుమారుడికీ..మా కుటుంబానికి ఆపద ఉందని వాపోయాడు. తప్పు చేసినట్లుగా రుజువైతే సదరు ఐపీఎస్ అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.