మహిళలకు గుడ్ న్యూస్ : పసుపు – కుంకుమకు లైన్ క్లియర్

ఏపీలో పసుపు - కుంకుమ పథకం..ఇతరత్రా పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కావా ? అనే టెన్షన్ తొలగిపోయింది.

  • Published By: madhu ,Published On : April 5, 2019 / 10:16 AM IST
మహిళలకు గుడ్ న్యూస్ : పసుపు – కుంకుమకు లైన్ క్లియర్

ఏపీలో పసుపు – కుంకుమ పథకం..ఇతరత్రా పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కావా ? అనే టెన్షన్ తొలగిపోయింది.

ఏపీలో పసుపు – కుంకుమ పథకం..ఇతరత్రా పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కావా ? అనే టెన్షన్ తొలగిపోయింది. పసుపు – కుంకుమ పథకం కింద నిధులు మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లబ్ధిదారుల  ఖాతాల్లో డైరెక్టుగా నిధులు బదిలీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. పసుపు – కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు లైన్ క్లియర్ అయ్యింది. యదావిధిగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఫించన్లు, పసుపు – కుంకుమ, అన్నదాత సుఖీభవ నగదు జమ కానుంది. ఏపీలో పెంచిన ఫించన్లు, పసుపు – కుంకుమ పథకం నగదు ఇవ్వవద్దంటూ ఢిల్లీ హైకోర్టులో జన చైతన్య వేదిక పిటిషన్ దాఖలు చేసింది. 
Read Also : అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు : జగన్‌కు పవన్ క్వశ్చన్

ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. వీటికి సంబంధించిన పూర్తి డిటైల్స్‌ను అందివ్వాలని ఏప్రిల్ 05వ తేదీ గురువారం ఎన్నికల సంఘాన్ని కోరింది. అన్నింటిని పరిశీలించిన ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఎన్నికల సమయంలో డబ్బులు ఇవ్వకుండా చూడాలని, డబ్బుతో ఓట్లను కొనుగోలు చేస్తున్నారని పిటిషన్‌లో జనచైతన్య వేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి తెలిపారు.

పిటిషనర్ తరపు వాదనలను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబమని హైకోర్టు స్పష్టం చేసింది. లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు పంపడం ఈసీ కోడ్ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది కోర్టు. దీనితో ఆలా పథకాల కింద ఉన్న లబ్దిదారులకు డబ్బులు వారి వారి ఖాతాలో పడనున్నాయి. 

ఎన్నికలకంటే ముందుగానే టీడీపీ ప్రభుత్వం పలు స్కీంలను ప్రకటించింది. అందులో అన్నదాత సుఖీభవ, పసుపు – కుంకుమ, నిరుద్యోగ భృతి, వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు పెన్షన్ అందచేస్తున్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాల మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద రూ.10వేలు ఇస్తామని బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి విడతగా రూ.2,500… రెండో విడతలో రూ.3,500 చొప్పున అందించింది. 

ఒక చెక్కు ఫిబ్రవరి, మరో చెక్ మార్చిలో, చివరి చెక్ ఏప్రిల్‌లో మార్చుకోవచ్చని పోస్ట్ డేటెడ్ చెక్కులు అందించింది. మూడో విడతగా రూ.4 వేలు సాయానికి సంబంధించిన చెక్కులను ఇప్పటికే బ్యాంకుల్లో వేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో… పసుపు – కుంకుమ డబ్బు పంపిణీని ఆపాలని కోర్టుకు వెళ్లడంతో లబ్దిదారుల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లబ్దిదారుల్లో సంతోషం వ్యక్తమౌతోంది. 
Read Also : బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తా జగన్ హామీ