పోలవరం ప్రాజెక్టుపై విచారణ : కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

  • Published By: madhu ,Published On : October 9, 2019 / 07:37 AM IST
పోలవరం ప్రాజెక్టుపై విచారణ : కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం లేదని దాఖలైన పిటీషన్‌పై.. ఢిల్లీ హైకోర్టులో అక్టోబర్ 09వ తేదీ బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌నే ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర జల శక్తి శాఖకు సూచించింది. ప్రాజెక్టు వ్యయాన్ని 16 వేల కోట్ల నుంచి 58 వేల కోట్లకు పెంచారని, టెండర్ నామినేషన్ల పద్దతిలో వేల కోట్ల రూపాయల పనులు అప్పగిస్తున్నారని.. సామాజిక కార్యకర్త పుల్లారావు పిటిషన్‌లో పేర్కొన్నారు. 

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయనతో 10tv మాట్లాడింది. కేంద్ర జలవనరుల శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించలేదన్నారు పుల్లారావు. ఏపీ ప్రభుత్వానికి సంబంధం ఉందని వ్యాఖ్యానిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో పీఎం పలు వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్వయంగా ఆయన వ్యాఖ్యానించినా..సీరియస్‌గా ఆలోచించడం లేదన్నారు. వేల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని..అవినీతి ఉందని అందరూ అన్నారని, వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉండేదని తెలిపారు. 
Read More : ముగిసిన దేవీ శరన్నవరాత్రులు.. కన్నుల పండుగగా తెప్పోత్సవం