దేవరగట్టు బన్నీ ఉత్సవం : కర్రలతో కొట్టుకున్న జనాలు

  • Published By: madhu ,Published On : October 9, 2019 / 01:17 AM IST
దేవరగట్టు బన్నీ ఉత్సవం : కర్రలతో కొట్టుకున్న జనాలు

కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవం రక్తసిక్తంగా మారింది. దాదాపు లక్ష మంది భక్తులు.. కర్రలతో ఉత్సవంలో పాల్గొన్నారు. మాల మల్లేశ్వరుల దేవతల విగ్రహాలు దక్కించుకునేందుకు.. గ్రామాల ప్రజలంతా కర్రలతో కొట్టుకున్నారు. 2 గ్రూపులుగా విడిపోయి.. విచక్షణారహితంగా కర్రలతో కొట్టుకున్నారు జనం. ఈ క్రమంలో.. 50 మందికి పైగా గాయాలయ్యాయి. కర్రల యుద్ధంలో.. వీరారెడ్డి అనే తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో.. పోలీసులు వెంటనే ఆదోని ఆస్పత్రికి తరలించారు.

ప్రతి ఏటా విజయదశమి రోజు దేవరగట్టులో బన్ని ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. మాలమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం తర్వాత.. స్వామివారిని ఊరేగిస్తారు. అలా.. కొండ దిగువన ఉన్న సింహాసన కట్టకు చేరుస్తారు. అక్కడే  అసలు కథ ప్రారంభమవుతుంది. ఆచారంలో భాగంగా.. ఉత్సవమూర్తులను తమ వశం చేసుకునేందుకు 11 గ్రామాల ప్రజలు కర్రల యుద్ధానికి దిగుతారు. 

రక్తపాతం జరగొద్దని అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు. నష్టమైన కార్యక్రమాలు చేయవద్దని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు యత్నించారు. అయితే..ఎన్ని చెప్పినా..సంప్రదాయాలని కొనసాగిల్సిందేనంటూ మంకుపట్టారు. ఫలితంగా రక్తపాతం ఆగలేదు..అధికారుల ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం జరగకుండా ఆగినట్లైంది. 
Read More : హైదరాబాద్ లో మళ్లీ కుండపోత : అప్రమత్తమైన అధికారులు