మైలవరం మొనగాడు ఎవరు : దేవినేని వర్సెస్ వసంత

రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తైతే.. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు మరో ఎత్తు. ఈ సీటు పైనే ఇప్పుడు అందరి చూపూ పడింది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు మంత్రి

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 02:18 PM IST
మైలవరం మొనగాడు ఎవరు : దేవినేని వర్సెస్ వసంత

రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తైతే.. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు మరో ఎత్తు. ఈ సీటు పైనే ఇప్పుడు అందరి చూపూ పడింది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు మంత్రి

రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తైతే.. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు మరో ఎత్తు. ఈ సీటు పైనే ఇప్పుడు అందరి చూపూ పడింది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు మంత్రి దేవినేని ఉమ, మరోవైపు మాజీ మంత్రి కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తుండటం… గెలుపుపై ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తుండటంతో.. మైలవరంలో మొనగాడు ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మైలవరం నియోజకవర్గంలో 2లక్షల 59 వేల 500 మంది ఓటర్లుండగా.. వీరిలో స్త్రీలు 1,30,812, పురుషులు 1,28,673 మంది ఉన్నారు. టీడీపీ అభ్యర్ధిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ చేయగా.. వైసీపీ నుంచి మాజీ మంత్రి కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్‌ బరిలో దిగారు. అటు ప్రచారం, ఇటు ఎన్నికలు, డబ్బులు పంచడం దగ్గర నుంచి జన సమీకరణ వరకూ అభ్యర్ధులు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డారు. అభివృద్ధిని దేవినేని పట్టించుకోలేదని వసంత ప్రచారం చేస్తే.. వసంత స్ధానికతను ప్రశ్నిస్తూ ఉమా ప్రచారం హోరెత్తించారు. అభ్యర్ధుల ప్రచారంతో పాటు పోలీసు కేసులతో నిత్యం వార్తల్లో ఉండటంతో .. ఈ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది.

దేవినేని ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు. వైసీపీ నుంచి కాజా రవికుమార్‌ టీడీపీలోకి రావడం .. బొమ్మసారి సుబ్బారావు ఓటింగ్ ఉమాకు ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు. కమ్మ సామాజికవర్గం అధికంగా ఉండటంతో .. ఆ ఓట్లు ఉమకే పడ్డాయన్న ధీమాలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఇక వైసీపీ అభ్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్‌కు మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేష్‌ బాబు అండగా నిలబడటంతో.. వసంతకు ఓటు బ్యాంకు పెరిగింది. ఉమాపై అవినీతి ఆరోపణలు వసంతకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇతర కులాల ఓట్లు తమకే పడ్డాయని వసంత వర్గం అంటోంది. మరోవైపు జనసేన అభ్యర్ధి గాంధీ .. టీడీపీ ఓట్లను చీల్చారనే ప్రచారం సాగుతోంది.

ప్రధానంగా దేవినేని మూడున్నరేళ్ల పాటు ప్రజలకు అందుబాటులో లేరని, అభివృద్ధి చెందిన గొల్లపూడిని దత్తత తీసుకోవడమే తప్ప మైలవరంను పూర్తిగా పట్టించుకోలేదన్న కోపంతో ప్రజలున్నారు. ఇదే విషయాన్ని ప్రచారంలో ప్రజలు ఉమాను అడిగితే.. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. పసుపు కుంకుమ ద్వారా ఓటింగ్‌ పెరగడంతో… తమకే అనుకూలంగా మహిళలంతా ఓట్లు వేశారని టీడీపీ నేతలు విశ్వసిస్తున్నారు. మైలవరానికి గుండె వంటి జక్కంపూడిలో అర్ధరాత్రి 12 గంటలవరకూ ఓటింగ్‌ జరగడంతో .. ఇరు పార్టీలు తమదే గెలుపనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు ఈ ఒక్క నియోజకవర్గంలోనే .. 40 కోట్లకు పైగా అభ్యర్ధులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కాస్ట్‌లీ నియోజకవర్గమైన మైలవరాన్ని చేజిక్కించుకునేందుకు టీడీపీ, వైసీపీలు మండుటెండను సైతం లెక్కచేయకుండా చెమటోడ్చాయి. ఇరు పార్టీలకు ఈ సీటు సవాల్‌ కావడంతో .. డబ్బును నీళ్లలా ఖర్చుచేశాయి. ఇక ఈ సీటు ఎవరు గెలుస్తారనే దానిపై నరాలు తెగే ఉత్కంఠకు తెరపడటానికి .. మే 23 వరకూ వేచి ఉండాల్సిందే.