ధర్మాడి టీమ్ సక్సెస్ : బోటు వెలికితీత.. కొన్ని గంటల్లో ఒడ్డుకి

ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం

  • Published By: veegamteam ,Published On : October 22, 2019 / 09:37 AM IST
ధర్మాడి టీమ్ సక్సెస్ : బోటు వెలికితీత.. కొన్ని గంటల్లో ఒడ్డుకి

ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం

ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటు బయటపడింది. కాగా, బోటుని ఒడ్డుకి చేర్చడానికి మరో 3 గంటలు పట్టే అవకాశం ఉంది. తీవ్ర ప్రయత్నాలు తర్వాత బోటుని నీళ్లపైకి తీసుకొచ్చింది ధర్మాడి సత్యం బృందం. లంగర్లు, ఐరన్ రోప్స్ సాయంతో బోటుని వెలికితీశారు. ఉచ్చుకి చిక్కిన బోటు పైకి తేలింది. పోర్టు అధికారి ఆదినారాయణ నేతృత్వంలో ఆపరేషన్ జరిగింది. రాయల్ వశిష్ట టూరిస్ట్ బోటు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉంది. ధర్మాడి టీమ్ రెండు విడతల్లో బోటు ఆపరేషన్ చేపట్టింది. డీప్ సీ డైవర్ల సాయంతో బోటుకి ఉచ్చు బిగించడంలో సక్సెస్ అయ్యారు.

సెప్టెంబర్ 15న కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం జరిగింది. గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలు వెళ్తుండగా బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 77మంది టూరిస్టులు ఉన్నారు. ప్రమాదం నుంచి 26మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 39 మృతదేహాలు వెలికితీశారు. మరో 12 మృతదేహాలు బోటులో ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

సోమవారం(అక్టోబర్ 21,2019) ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును బయటకు తీసింది. యాంకర్‌కు తగిలిన బోటు పైకప్పును పైకి తీసుకొచ్చారు. సుడిగుండాలు లేకపోవడం.. గోదావరి నీటిమట్టం 38-40 అడుగుల స్థాయిలోనే ఉండటంతో బోటును వెలికితీసేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

విశాఖపట్నం నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్‌ వాటర్‌ సర్వీసెస్‌కు చెందిన 10 మంది డీప్ సీ డైవర్లలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు. 15 నిమిషాల పాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది? దాని చుట్టూ ఇసుక, మట్టి ఎంతమేర పేరుకుపోయాయి? బోటుకు ఎక్కడ తాడు బిగిస్తే పైకి రావడానికి అనువుగా ఉంటుందనే కోణంలో పరిశీలించి వచ్చి పోర్టు అధికారికి వివరించారు. ఇలా ఆరుసార్లు డైవర్లు బోటు మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరిలో బోటు ఏటవాలుగా మునిగి ఉందని పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ తెలిపారు.