ఇంటి వద్దకే పించన్లు…తెల్లవారకముందే వాలిపోయిన వాలంటీర్లు

ఏపీ సీఎం జగన్‌ ఆదేశాలతో తొలిరోజే పెన్షన్లు పంపిణీ దాదాపు పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్‌ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది.

  • Published By: veegamteam ,Published On : March 1, 2020 / 07:13 AM IST
ఇంటి వద్దకే పించన్లు…తెల్లవారకముందే వాలిపోయిన వాలంటీర్లు

ఏపీ సీఎం జగన్‌ ఆదేశాలతో తొలిరోజే పెన్షన్లు పంపిణీ దాదాపు పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్‌ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది.

ఏపీ సీఎం జగన్‌ ఆదేశాలతో తొలిరోజే పెన్షన్లు పంపిణీ దాదాపు పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్‌ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఆదివారం (మార్చి 1, 2020) ఉదయం 6 గంటలనుంచే గడపగడపకు పింఛన్‌ పంపిణీ మొదలైంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు 43.9 లక్షలకుపైగా పెన్షన్ల పంపిణీ
ఉదయం 8 గంటలకే 26,20,673 పెన్షన్లు పంపిణీ చేశారు. ఉదయం 9 గంటలకు 31లక్షల పెన్షన్లు, ఉదయం 10 గంటలకే 37.5 లక్షల పెన్షన్లు, ఉదయం 11 గటలకు 41.12 లక్షల పెన్షన్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు 43.9 లక్షలకుపైగా పెన్షన్ల పంపిణీ పూర్తయింది. ఈ మధ్యాహ్నానికి దాదాపు 60 లక్షల మందికి 1,384 కోట్ల రూపాయల పింఛన్‌ పంపిణీ చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

బయోమెట్రిక్‌ విధానం ద్వారా నగదు పంపిణీ 
బయోమెట్రిక్‌ విధానం ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకున్న తర్వాత నగదు పంపిణీ చేస్తున్నారు.  పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీరు తమ పరిధిలో ఉండే ఫించనుదారులందరినీ ఒక చోటుకు పిలిపించకూడదని ఇదివరకే స్పష్టంగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పాటు ఈ ప్రక్రియతో సంబంధం లేని ప్రైవేట్‌ వ్యక్తులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లొద్దని వలంటీర్లకు సూచనలు జారీఅయ్యాయి. 

2019 జనవరిలో పెన్షన్ల మొత్తం రూ. 490 కోట్లు 
2019 జనవరిలో పెన్షన్ల మొత్తం రూ. 490 కోట్లు మాత్రమే అని అధికారులు లెక్కలు తేల్చారు. దీనిలో భాగంగా మొదటి నెల గడగడపకూ పెన్షన్ల కార్యక్రమంలో సమస్యలను గుర్తించిన అధికారులు.. యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ చొప్పున డిజిటల్‌ మ్యాపింగ్‌ పూర్తి చేశారు. వేలిముద్రలు, ఐరిస్, ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఇలా పలు విధానాల్లో లబ్ధిదారులకు పెన్షన్‌ పంపిణీ చేస్తున్నారు.

ఇంటింటికీ వెళ్లి కృష్ణా జిల్లా కలెక్టర్ పింఛన్లు పంపిణీ
కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం అల్లాపురంలో ఇంటింటికీ వెళ్లి  జిల్లా కలెక్టర్ MD.ఇంతియాజ్ అహ్మద్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు   ఎండివో సుభాషిణి , ఈవోపిఆర్డి , ఏపివో పలువురు అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ 47వ వార్డ్ హౌసింగ్ కాలనీకి చెందిన పింఛన్ లబ్ధిదారులు లక్ష్మమ్మ కు వాలంటీర్ బాలాదేవి పెన్షన్ అందజేశారు.

తెనాలిలో వాలంటీర్లతో ఘర్షణకు దిగిన వితంతువులు
గుంటూరు జిల్లా తెనాలి వార్డ్ లో గత రెండు నెలలుగా పెన్షన్లు రావడం లేదని కొంతమంది వితంతువులు వాలంటీర్లతో ఘర్షణకు దిగారు. గత నెలలో అడిగితే ఈ నెలలో ఇస్తామని అన్నారని మరల ఇప్పుడు అదే మాట చెబుతున్నారని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు.