దీపావళి 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?

  • Published By: veegamteam ,Published On : October 18, 2019 / 10:04 AM IST
దీపావళి 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?

దీపావళి అంటే దీపాల పండుగ.. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఐదు రోజులపాటు జరుపుకుంటారు. ఆ రోజు అందరి ఇళ్ళ ముందు మట్టితో తయారుచేసిన నూనె దీపాలను పెడతారు. ఇక ఈ పండుగ రోజు స్నేహితులతో కలిసి టపాసులు కాల్చటం కోసం చిన్నపిల్లలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. కానీ పెద్దవారు మాత్రం లక్ష్మీదేవిని పూజించి ఇంట్లోకి ఆహ్వానించాలని అనుకుంటారు. 

లక్ష్మీదేవి పుట్టినరోజున విష్ణుమూర్తి నీకేం కావాలని అడిగితే నేను భూలోకానికి వెళ్ళి అంతా చూడాలనే కోరిక ఉందని చెప్పిందట. విష్ణుమూర్తి వెంటనే లక్ష్మీదేవిని భూలోకానికి పంపారు. అలా ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుందట. కానీ ఏ ఇళ్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందట. 

మొదటి రోజు ధంతేరాస్..
ఈ రోజు హిందువులంతా లక్ష్మిదేవిని పూజించి దీపాలు పెట్టి స్వీట్స్ అందిస్తారు. అనంతరం వెండి లేదా బంగారు వస్తువులను కొనుగోలు చేస్తారు. సూర్యాస్తమయ సమయంలో హిందువులందరూ స్నానం చేసి లక్ష్మి పూజ చేసి దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలు చెడు ఆత్మలను ఇంట్లోకి రానివ్వవని ప్రజల నమ్మకం.
 
రెండో రోజు ఛోటి దివాళీ.. 
ఛోటీ దీపావళి రోజున హిందువులు శరీరానికి నూనె పట్టించి స్నానం చేస్తారు. తక్కువ లైటింగ్ లో పాటలు పాడతారు. దీనిని నారక్ చతుర్దాసి అని కూడా అంటారు. 

మూడోవ రోజు దీపావళి..
ఈ రోజు చీపురును పూజిస్తారు. ఇది ఇంటిని శుభ్రంగా ఉంచటానికి సహాయపడుతుంది. దేవాలయాలలో డ్రమ్స్, గంటలను మ్రోగిస్తారు. అలాగే దీపాలను వెలిగించి టపాసులను కాలుస్తారు. చెడు మీద విజయం సాధించిన లక్ష్మి దేవి యొక్క దీవెనలను తీసుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి బహుమతులు ఇచ్చుకుంటారు.

నాలుగవ రోజు గోవర్ధన్ పూజ..
భారీ వర్షాల కారణంగా ప్రజలను రక్షించటానికి గోవర్ధన పర్వతం ఎత్తిన దానికి గుర్తుగా గోవర్ధన్ పూజ చేస్తారు. అంతేకాదు కొత్తగా పెళ్లైన జంటలను ఆహ్వానించి రకరకాల పిండివంటలతో ప్రత్యేక భోజనం పెట్టి బహుమతులను అందిస్తారు.

ఐదవ రోజు భాయ్ దూజ్ దీపావళి..
భాయ్ దూజ్ దీపావళి ఆఖరి రోజున చేస్తారు. మత గ్రంధాల ప్రకారం, యముడు తన సోదరి ఇంటిని సందర్శించిన్నప్పుడు అతని సోదరి యామి అతని సంక్షేమం కోసం అతని నుదుటిపై ఒక పవిత్రమైన తిలకం ఉంచడం ద్వారా అతనికి స్వాగతిస్తుంది. అప్పుడు యముడు ఒక సోదరి ఆమె సోదరుడు నుదుటి మీద తిలకం పెడితే అతనికి ఎవరు హాని చేయరని చెప్పుతాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున భాయ్ దూజ్ చేయటం ఆచారంగా మారింది.