ఈ ట్విస్ట్ ఏంటీ : చంద్రబాబుతో డీఎంకే కీలక నేత భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న  తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది. 

  • Published By: veegamteam ,Published On : May 14, 2019 / 09:54 AM IST
ఈ ట్విస్ట్ ఏంటీ : చంద్రబాబుతో డీఎంకే కీలక నేత భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న  తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది. 

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న  తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది. 

తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత  కరుణానిథికి అత్యంత ఆప్తుడు..పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న దొరై మురుగన్ స్వయంగా విజయవాడ వచ్చి చంద్రబాబుతో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆరు విడతలుగా లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఏడవ విడత చివరిది అయిన లోక్ సభ ఎన్నికలు మే 19న ఆదివారం జరగనున్నాయి. ఈ క్రమంలో దేశంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. థర్డ్ ఫ్రంట్ అంటు చంద్రబాబు..ఫెడరల్ ఫ్రంట్ అంటు కేసీఆర్ పలు పార్టీలకు చెందిన నేతలను..సీఎంలను కలిసి చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. 

బీజేపీ ఏతర పార్టీలతో చంద్రబాబు భేటీ అయి పలు చర్చలు నిర్వహించారు. రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొని బీజేపీకి వ్యతరేకత శక్తులతో కలిసి ప్రచారంలో కూడా చంద్రబాబు పొల్గొన్నారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శరత్ పవార్, ఎస్పీ,బీఎస్పీ  నేతలు మాయవతి, అఖిలేశ్ యాదవ్ లు కూడా బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడాలని పలు భేటీలు కూడా నిర్వహించారు. 

కాగా మే 23న పోలింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలు వెలువడిన అనంతరం బీజేపీ ఏతర శక్తులన్నీ సమావేశం అయి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా 2019 ఎన్నికలు దేశంలో రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ మార్పులకు తుది రూపం ఏం విధంగా ఉండనుంది అనే విషయం తేలాలి అంటే మే 23 తరువాత వెలువడే ఫలితాలపై ఆధారఫడి ఉంది. అప్పటి వరకూ వేచి చూడాల్సిందే.