మహారాష్ట్ర జాలరి వలలో పడ్డ రెండు తలల షార్క్ ఫిష్ పిల్ల..

  • Published By: nagamani ,Published On : October 16, 2020 / 05:44 PM IST
మహారాష్ట్ర జాలరి వలలో పడ్డ రెండు తలల షార్క్ ఫిష్ పిల్ల..

Double headed shark fish : రెండు తలల పాములు చూశాం..రెండు తలతో పుట్టిన గేదె దూడల్ని చూశాం. మేకల్ని కూడా చూశాం. కానీ రెండు తలలు ఉన్న షార్క్ చేపని ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? మహారాష్ట్రలో రెండు తలలు ఉన్న ఓ షార్క్ చేప జాలరి వలలో పడింది. అటువంటి చేపల్ని ఎప్పుడూ చూడని ఆ జాలరి అరుదుగా ఉండే ఆ రెండు తలల చేపని తిరిగి సముద్రంలోనే వదిలేశాడు. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ ఈ రెండు తలల షార్క్ తుర్రుమంటూ సముద్రం నీటిలోకి వెళ్లిపోయింది.


భూమిపై ఉండే జీవరాశులు కంటే సముద్రాలలో ఉండే జీవరాశులే ఎక్కువ. వింతలు..విశేషాలు..అద్భుతాలను నిలయం సముద్రాలు..వింతలే కాదు రహస్యాలు.. ప్రమాదాలకు కూడా సముద్రాల సొంతం. వింత వింత జీవులు మనం ఊహించలేని వింతలు సముద్రాల్లో ఉంటాయి.


మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా సత్పతి గ్రామానికి చెందిన నితిన్ పాటిల్ చేపల వేటకు వెళ్లగా అతని వలలో రెండు తలల షార్క్ పిల్ల పడింది. చాలా చిన్నదిగా ఉన్న దాన్ని చూసిన పాటిల్ దాన్ని వింతగా చూసాడు. తరువాత దాన్ని ఫొటోలు తీసుకుని ‘చిన్నపిల్ల..పైగా అరుదైనది ఇటువంటివి బతకాలి అనుకుని తిరిగి నీటిలో వదిలేశాడు.


ఆ ఫోటోలో చూసిన మత్స్యనిపుణులు అటువంటివి చాలా అరుదైనవి తెలిపారు. మనదేశంలో ఇలాంటి రెండు తలకాయల షార్క్ పిల్ల కనిపించడం ఇది మూడోసారి అని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ శాస్త్రవేత్త కేవీ అఖిలేశ్ వెల్లడించారు.



తొలుత అలాంటి పిల్ల 1964లో గుజరాత్‌లో, రెండోసారి 1991లో కర్ణాటకలో కనిపించాయని చెప్పారు.