మీరు గొప్పోళ్లు : హెల్మెట్ లేకుండా కారు డ్రైవింగ్..ఫైన్ 

  • Edited By: veegamteam , February 15, 2019 / 03:56 AM IST
మీరు గొప్పోళ్లు : హెల్మెట్ లేకుండా కారు డ్రైవింగ్..ఫైన్ 

చిత్తూరు : హెల్మెట్ పెట్టుకోకుండా..డ్రైవింగ్ చేస్తే ఫైన్ వేయటం మామూలే. కానీ హెల్మెట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేసాడంటు ఫైన్ వేసిన పోలీసులు నిర్వాకం గురించి ఇప్పుడు కొత్తగా వినాల్సి వస్తోంది. సాధారణంగా సీట్ బెల్ట్ పెట్టుకోండా డ్రైవ్ చేయాలనేది రూల్. కానీ చిత్తూరు పోలీసులు తీరే వేరు. కారు నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదంటు ఛలానా పంపించారు. అది చూసి..నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు సదరు వ్యక్తికి. 
 

‘ఏపీ 03 బీజెడ్ 7345’ అనే నంబర్ కారుపై హెల్మెట్ లేకుండా వెళుతున్నారని చెబుతూ రూ. 135 జరిమానా చెల్లించాలని కారు యజమానికి ఈ-చెలాన్ వచ్చింది. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు దీన్ని జారీ చేశారు. గురువారం (ఫిబ్రవరి14) రాత్రి పానగల్ సమీపంలో దీన్ని గుర్తించామనీ..మార్చి 1లోపు ఫైన్  కట్టాలని కూడా చలానా నోటీస్ లో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే వెహికల్ గల వ్యక్తి మాత్రం తాను నడిపింది బైక్ కాదనీ..కారు అని..గురువారం రాత్రి తానసలు అటువైపే పోలేదనీ మొత్తుకుంటున్నాడు. ఇది టెక్నాలజీ లోపమా..లేదా పోలీసులు నిర్వాకమా..తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ విషయంమాత్రం వైరల్ గా మారింది. దీంతో పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.