డేంజర్ బెల్స్ : విజయవాడతో పాటు 50 నగరాలకు భూకంపం ముప్పు

ఏపీలోని విజయవాడకు భూకంపం ముప్పు ఉందా.. అంటే అవుననే అంటోంది అధ్యయనం. మన దేశంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్న నగరాలు ఏవి అనే అంశంపై

  • Published By: veegamteam ,Published On : October 15, 2019 / 04:01 AM IST
డేంజర్ బెల్స్ : విజయవాడతో పాటు 50 నగరాలకు భూకంపం ముప్పు

ఏపీలోని విజయవాడకు భూకంపం ముప్పు ఉందా.. అంటే అవుననే అంటోంది అధ్యయనం. మన దేశంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్న నగరాలు ఏవి అనే అంశంపై

ఏపీలోని విజయవాడకు భూకంపం ముప్పు ఉందా.. అంటే అవుననే అంటోంది అధ్యయనం. మన దేశంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్న నగరాలు ఏవి అనే అంశంపై అధ్యయనం జరిగింది. 50 నగరాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. భూకంప ముప్పు ఉన్న 50 నగరాల్లో.. 13 నగరాలు అధిక ప్రమాదకర స్థాయి కాగా.. 30 నగరాలకు ముప్పు మధ్యస్థంగా ఉంది. 7 నగరాలకు తక్కువ ప్రమాదకర స్థాయి ఉంది. 50 నగరాల్లో అధిక భూకంప ముప్పు ఉన్న జాబితాలో ఏపీలోని విజయవాడ కూడా ఉంది. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (NDMA), కేంద్ర ప్రభుత్వం కలిసి… భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక (Earthquake Disaster Risk Index) రిపోర్ట్ ని తయారు చేశాయి. 

అధిక భూకంపాలు వస్తాయని చెప్పిన నగరాల్లో విజయవాడతో పాటు ఢిల్లీ, కోల్‌కతా, పుణె, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌, సిలిగురి, డార్జిలింగ్‌, ఛండీగఢ్‌, 13 నగరాలు ఉన్నాయి. ఈ నగరాలకు భూకంపం ముప్పు మరీ ఎక్కువని అధ్యయనంలో తేలింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇళ్లలో ఉన్నప్పుడు ఎదైనా కదలిక వస్తే… వెంటనే బయటకు వచ్చేయాలన్నారు.

దేశంలోని 50 నగరాల్లో భూకంప ప్రభావం ఉండగా… వాటిలో 13 నగరాల్లో తీవ్రమైన భూకంపాలు రానున్నాయి. 30 నగరాల్లో రిక్టర్ స్కేల్ పై 4 నుంచి 6 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఎంత మంది ప్రజలు ఉంటున్నారు? ఇళ్ల నిర్మాణం ఎలా ఉంది? నగరాలు ఎక్కడున్నాయి, ప్రస్తుతం వాటి పొజిషన్ ఏంటి? సముద్రానికి ఎంత దూరంలో ఉన్నాయి? ఇదివరకు అక్కడ భూకంపాలు వచ్చాయా? వంటి చాలా అంశాలు లెక్కలోకి తీసుకుని నివేదికను రూపొందించారు.

విజయవాడ దాని చుట్టూ 150 కి.మీ. పరిధిలోని ప్రాంతం భూకంప జోన్‌లో ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే తెలిపింది. 2015 నాటికి ఈ ప్రాంతంలో 150 వరకు భూప్రకంపనలు నమోదయ్యాయని వెల్లడించింది. ఇక్కడి నేలల స్వభావం కారణంగా భూకంపం ముప్పు ఎక్కువని స్పష్టం చేసింది. విజయవాడ భూకంప ప్రభావ ప్రాంతాల్లో ఒకటని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ విద్యార్థులు 2015లో నిర్వహించిన సర్వేలోనూ వెల్లడైంది. గుణదల, మొగల్రాజపురం, బందర్ రోడ్డు, కానూరు, పోరంకి, భవానీపురం, కొండపల్లి ప్రాంతాలు భూకంప జోన్‌లో ఉన్నాయని సర్వే తెలిపింది. విజయవాడ ప్రాంతం ఎత్తయిన భవనాల నిర్మాణానికి అనుకూలం కాదని ఆ అధ్యయనం స్పష్టం చేసింది.

సముద్రానికి దగ్గరగా ఉండే నగరాలకు భూకంపం వచ్చే ప్రమాదం ఎక్కువే. ఎందుకంటే… సముద్రాల్లోని భూఫలకాల్లో కదలిక ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా… సునామీలు, భూకంపాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ. విజయవాడకు అధిక భూకంప ముప్పు ఉందని తేలడంతో.. స్థానికులు ఆందోళన పడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్ అవుతున్నారు.