బిగ్ షాక్ : సుజనా గ్రూపుపై ఈడీ కొరడా

  • Published By: madhu ,Published On : April 2, 2019 / 03:45 PM IST
బిగ్ షాక్ : సుజనా గ్రూపుపై ఈడీ కొరడా

దేశంలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే కంపెనీలు, వ్యక్తులు పెరిగిపోతున్నారు. సుజనా గ్రూప్‌పై ఈడీ కొరడా ఝులిపించింది. బ్యాంకు రుణం కేసులో రూ. 315 కోట్లను సీజ్ చేసింది. షెల్ కంపెనీల నుండి భారీగా నిధులు మళ్లించినట్లు గుర్తించింది. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులోని ఆస్తులను ఏప్రిల్ 02వ తేదీ మంగళవారం అటాచ్ చేసింది. బీసీఈపీఎల్ కంపెనీ పేరిట రూ. 364 కోట్ల రుణాన్ని సుజనా గ్రూప్ తీసుకుంది. చెన్నైలోని ఆంధ్రాబ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల నుండి ఈ సంస్థ రుణాలు తీసుకుంది. వైస్రాయ్ హోటల్, మహల్ హోటల్స్‌కు రూ. 316 కోట్లు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 

ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో ఈడీ ఆస్తులను అటాచ్ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇటీవలే సుజనా కంపెనీలపై సోదాలు చేసి షెల్ కంపెనీలను గుర్తించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మిగిలిన కంపెనీలకు బదలాయించాయనే ఆరోపణలున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.