అమరావతి పరిధిలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం

అమరావతి రాజధాని ప్రాంతంలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 8 గ్రామ పంచాయతీలను నోటిఫై చేస్తూ గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 03:51 PM IST
అమరావతి పరిధిలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం

అమరావతి రాజధాని ప్రాంతంలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 8 గ్రామ పంచాయతీలను నోటిఫై చేస్తూ గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి రాజధాని ప్రాంతంలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 8 గ్రామ పంచాయతీలను నోటిఫై చేస్తూ గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావూరు, వడ్డేశ్వరం, గుండిమెడ, ప్రాతూరు గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి సీఎం జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరసనగా అమరావతి గ్రామాల రైతుతు ఉద్యమిస్తున్న తరుణంలో కీలక ప్రకటన వెలువడింది. 

అమరావతి పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఫలితంగా ఆయా పంచాయతీలన్నీ ఇక వార్డులుగా రూపాంతరం చెందుతాయి. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ గురువారం సాయంత్రం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఆ నోటిఫికేషన్ ప్రభావం వల్ల అమరావతి గ్రామాల పరిధిల స్వరూపం కొంతవరకు మారిపోయినట్టయింది. దీనితో పాటు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎంపిక చేసిన కొన్ని గ్రామాలకు పంచాయతీ హోదాను కల్పించింది.

ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని ప్రాతూరు, వడ్డేశ్వరం, పెనుమాక, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావూరు, గుండిమేడ, ఉండవల్లి పంచాయితీలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలన్నీ గుంటూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. తాడేపల్లి మున్సిపాలిటీలో చేర్చడం వల్ల అవన్నీ వార్డులుగా మారిపోతాయి. పట్టణ హోదా కల్పించినట్టయింది.

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు కొనసాగిస్తోన్న ఉద్యమం 50 రోజులు దాటిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తాజాగా ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయడం చర్చనీయాంశమైంది. జగన్ సర్కార్ మరో వివాదానికి తెర తీసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాలే లేకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉద్యమాన్ని అడ్డుకోవడానికి కొత్త ఎత్తుగడను వేసిందని విమర్శిస్తున్నారు.