కారణం ఇదే : ఆలస్యంగా ఎన్నికల ఫలితాలు

  • Published By: veegamteam ,Published On : April 29, 2019 / 01:24 PM IST
కారణం ఇదే : ఆలస్యంగా ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలసమయ్యే అవకాశం ఉందా అంటే.. అవుననే అంటున్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది. ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. దీనికి కారణం వీవీప్యాట్ స్లిప్స్ లెక్కింపు అని చెప్పారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్ స్లిప్పులు లెక్కింపు ఉంటుందని ద్వివేది తెలిపారు.
Also Read : బ్రాండ్ అంటే ఇదే : హైదరాబాద్ ఐటీ ఎగుమతులు లక్ష కోట్లు

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో ఫలితాల వెల్లడిలో జాప్యం ఉంటుందన్నారు. ఒక్కో వీవీప్యాట్ లో వెయ్యి ఓట్లు పోలయ్యే అవకాశం ఉందన్నారు. అవన్నీ కౌంట్ చెయ్యాలంటే టైమ్ పడుతుందన్నారు. ఒక్కో వీవీప్యాట్ కౌంటింగ్ కు గంట నుంచి గంటన్నర సమయం పట్టే ఛాన్స్ ఉందన్నారు. ఈ కారణంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, లోక్ సభ ఎన్నికల ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం ఉంటుందని వివరించారు. ఈవీఎంలలో పోలైన ఓట్లతో.. స్లిప్పులు సరిపోయిన తర్వాతే రిజల్ట్స్ అనౌన్స్ మెంట్ ఉంటుందన్నారు.
Also Read : నుబియా Red Magic 3 : ఈ స్మార్ట్ ఫోన్లలో కూలింగ్ ఫ్యాన్

ఎన్నికల కౌంటింగ్‌ కోసం 21 వేల సిబ్బంది అవసరమని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ఇదివరకే చెప్పారు. ఆఖరి నిమిషం వరకూ ఎవరు, ఎక్కడ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారో తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 2 సార్లు సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు పరిధిలో ఐదేసి పోలింగ్‌ కేంద్రాల్లో వీవీ ప్యాట్‌ ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. ముందుగా పోస్టల్‌, సర్వీస్ ఓటర్ల లెక్కింపు ఉంటుందన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కౌంటింగ్‌ కు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. టేబుళ్లు పెంపు కోసం విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఒక్కో టేబుల్‌ కు కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ను నియమిస్తున్నామన్నారు. రీ పోలింగ్‌ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఆమోదం రావాల్సి ఉందని గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.

ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. 80శాతం పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలం అని టీడీపీ, వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. మరోసారి గెలుపు ఖాయం అని టీడీపీ అంటుంటే.. ఈసారి విజయం తమదే అని వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 19న చివరి విడత పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read : గాల్లో తేలిపోతూ జర్నీ : డ్రైవర్ లెస్ Sky Train చూశారా?